తెలంగాణ

telangana

GVL On Amaravati Capital: ఆ రాజధానికే భాజపా ఓటు : జీవీఎల్

By

Published : Dec 18, 2021, 8:23 PM IST

MP GVL On Amaravati Capital: ఏపీలోని రాయలసీమ జిల్లాల అభివృద్ధి అజెండాతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి భాజపా కట్టుబడి ఉందన్నారు.

GVL On Amaravati Capital
GVL On Amaravati Capital

MP GVL On Amaravati Capital: ఏపీకి రాజధాని అమరావతి అంశంపై భాజపా మొదటి నుంచి కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అనంతపురంలో నిర్వహించిన భాజపా శిక్షణ తరగతులకు హాజరైన ఆయన.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆనాడు కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు.

రాయలసీమ జిల్లాల నుంచి దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినా.. అభివృద్ధిలో మాత్రం నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధి అజెండాతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Pushpa Review: 'మాస్​ సినిమాకు సరికొత్త డెఫినిషన్​ 'పుష్ప''

ABOUT THE AUTHOR

...view details