తెలంగాణ

telangana

GVL On GRMB, KRMB: 'గెజిట్​ అమల్లో ఏపీ, తెలంగాణ నిర్లక్ష్యం'

By

Published : Nov 29, 2021, 10:44 PM IST

కృష్ణా, గోదావరి గెజిట్‌ నోటిఫికేషన్ అమలులో తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL On KRMB,GRMB) అన్నారు. బోర్డు కార్యకలాపాల కోసం రెండు రాష్ట్రాలు నిధులివ్వలేదన్నారు.

gvl narsimharao
gvl narsimharao

కృష్ణా, గోదావరి గెజిట్‌ నోటిఫికేషన్ అమలులో తెలుగు రాష్ట్రాల వైఖరిని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు (MP GVL on KRMB, GRMB) తప్పుపట్టారు. బోర్డు కార్యకలాపాల కోసం ఇరు రాష్ట్రాలు నిధులివ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించటంపై ఆయన మండిపడ్డారు.

'కృష్ణా, గోదావరి గెజిట్‌ నోటిఫికేషన్ అమలులో నిర్లక్ష్యం.. బోర్డు కార్యకలాపాల కోసం రెండు రాష్ట్రాలు నిధులివ్వలేదు. 6 నెలల్లో డీపీఆర్‌ ఇవ్వాలని ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. డీపీఆర్‌లు ఇవ్వడంలో ఏపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి జరగబోయే అన్యాయంపై ప్రభుత్వం మేలుకోవాలి. సీఎం జగన్‌ వెంటనే సంబంధిత శాఖలతో సమీక్ష జరపాలి. డీపీఆర్‌ వెంటనే సమర్పించేలా చర్యలు తీసుకోవాలి"

-జీవీఎల్ నరసింహారావు, భాజపా ఎంపీ

GVL On GRMB, KRMB: 'డీపీఆర్​ వెంటనే సమర్పించాలి'

ఇదీచూడండి:KCR On Yasangi: 'యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు'

ABOUT THE AUTHOR

...view details