తెలంగాణ

telangana

సీఐడీ కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌

By

Published : Sep 6, 2022, 8:02 PM IST

Anticipatory Bail For Narayana: ఏపీలో రాజధాని బృహత్ ప్రణాళిక, ఇన్నర్​ రింగ్​రోడ్డు అలైన్​మెంట్​లో ఆరోపణల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతించింది.

నారాయణ
నారాయణ

Anticipatory Bail For Narayana: ఆంధ్రప్రదేశ్​లో రాజధాని బృహత్‌ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఆయనతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతించింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో ముందస్తు బెయిల్‌ కోసం మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, అంజనీకుమార్‌ హైకోర్టులో పిటిషనర్‌ వేసుకోగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వు చేసింది. అయితే, తాజాగా వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ మంజూరు కానప్పుడు అవినీతి జరగటానికి ఎలా ఆస్కారం ఉంటుందని పిటిషనర్‌తరఫు న్యాయవాది వాదించారు.

రాజకీయ దురుద్దేశంతోనే పిటిషనర్లపై కేసులు పెట్టారని.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీంతో తాజాగా వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి:ట్రాఫిక్​ జరిమానాల బాదుడు.. మూడుసార్లు చిక్కితే ఇంక అంతే..

కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details