తెలంగాణ

telangana

Amaravati maha padayatra: 17వ రోజు ప్రారంభమైన అమరావతి 'మహా పాదయాత్ర'

By

Published : Nov 17, 2021, 10:49 AM IST

అమరావతిని(Amaravathi) ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన మహాపాదయాత్ర(Farmers Maha Padayatra) 17వ రోజూ ప్రారంభమైంది. ఇవాళ రైతులు 16కిలోమీటర్లు నడవనున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల(three capitals issue) నిర్ణయంపై వెనక్కు తగ్గేవరకూ పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

Amaravati maha padayatra, farmers padayatra
అమరావతి మహా పాదయాత్ర, రైతుల పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(Amaravati maha padayatra) 17 రోజు ప్రారంభమైంది. ఇవాళ ఈ యాత్ర 16కిలో మీటర్లు సాగనుంది. కందకూరులోని వెంగమాంబ కల్యాణమండపం నుంచి యాత్ర మొదలుకాగా.. మూపాడులో అన్నాదాతలు(Farmers Maha Padayatra) మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలు దేరి రాత్రికి గుడ్లూరు చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. మూడు రాజధానులు(three capitals), సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 45 రోజులపాటు మహా పాదయాత్ర చేపట్టారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా పాదయాత్ర చేపట్టారు.

రాజధాని రైతుల సంకల్పం

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమ పోరాట పంథా(Amaravathi maha Padayatra)లో ముందుకుపోతున్నారు. మూడు రాజధానులు, సీఆర్​డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు... వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని ఆ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ప్రారంభించారు.

సర్వమత ప్రార్థనలు...

అంతకుముందు మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగాలని ప్రార్ధించారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5కోట్ల ప్రజల జీవితాలు, ఏపీ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా మహిళలు తెలిపారు. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలిపుతున్నారని ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు.

వివిధ పార్టీల నేతల మద్దతు...

అమరావతి ప్రజల ఆకాంక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. రైతులు, మహిళలతో కలిసి పాదయాత్ర(Amaravathi maha Padayatra)లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కొనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర(Amaravathi maha Padayatra) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అమరావతి రైతులు నడవనున్నారు. రైతుల ఈ మహాపాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. కాగా కొన్ని చోట్లు ఉద్రిక్తతలు కూడా జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:kuppam municipal election: ‘పుర’ ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details