తెలంగాణ

telangana

కేజీబీవీలో వికటించిన భోజనం.. 20 మంది బాలికలకు అస్వస్థత

By

Published : Aug 1, 2022, 12:44 PM IST

FOOD POISON

FOOD POISON: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. తాజాగా బేల మండలానికి చెందిన కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్టల్ అధికారులు అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

FOOD POISON:ఆదిలాబాద్​లోని బేల మండలానికి చెందిన కస్తూర్బా విద్యాలయంలో నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం విషతుల్యంగా మారి దాదాపు 20 మంది విద్యార్థినిలను అస్వస్థతకు గురిచేసింది. ఆదివారం మధ్యాహ్నం చికెన్​తో భోజనం చేసే సమయంలో అన్నంలో పురుగులు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. తరువాత రాత్రి భోజనం చేయకుండానే పడుకున్నామని ఉదయం నిద్రలేచిన విద్యార్థినులకు కళ్లు తిరగటం, వాంతులు, విరేచనాల కావటంతో సిబ్బందికి వివరించారు.

హాస్టల్‌ అధికారులు అప్రమత్తమై... అస్వస్థతకు గురైన వారందరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. కాగా.... కేజీబీవీలో అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపించటమే ఘటనకు కారణమని విద్యార్థినులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చినట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"పాఠశాలలో పరిశుభ్రత సరిగ్గా లేదు. బియ్యంలో తెల్లని పురుగులు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం చికెన్​తో తినే భోజనంలో పురుగులు వచ్చాయి. ఏంటి అని అడిగితే మీ ఇళ్లలో రావా అని అన్నారు. నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు. ఫలితంగా కడుపులో నొప్పి, వాంతులు విరేచనాలు అవుతున్నాయి. హాస్టల్​లో తినలేక కాలి కడుపుతో ఉంటున్నాం.''-విద్యార్థినులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details