తెలంగాణ

telangana

Visa Free Countries For Indians : ఇండియన్ పాస్​పోర్ట్​తో..​ వీసా లేకుండా ఆ 57 దేశాల్లో ప్రయాణించవచ్చు!

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 7:23 PM IST

Visa Free Countries For Indians In Telugu : మీకు ప్రపంచ పర్యటన చేయాలని ఉందా? వీసాలు త్వరగా రావడం లేదా? అయితే ఇది మీ కోసం. ప్రపంచంలోని మొత్తం 57 దేశాల్లో భారతీయ పౌరులు ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Countries That Allow Visa Free Travel
Visa Free Countries For Indians

Visa Free Countries For Indians : నేటి యువత ప్రపంచ పర్యటనలపై ఎనలేని మక్కువ చూపిస్తోంది. వివిధ దేశాలను చుట్టి రావాలని కలలు కంటోంది. ముఖ్యంగా భారతీయ యువతీయువకులు విదేశీ పర్యటనలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. వీరు చాలా సులువుగానే ఇండియన్​ పాస్​పోర్ట్​ను పొందగలుగుతున్నారు. కానీ విదేశీ పర్యటనలకు కావాల్సిన వీసాలను పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఈ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారా? అయితే మీరేమీ చింతించకండి. వీసా లేకుండా భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Visa Free Countries For Indian Passport Holders : హెన్లీ అండ్​ పార్ట్​నర్స్​ 2023కు చెందిన పాస్​పోర్ట్ఇండెక్స్​లోని సమాచారం ప్రకారం, ఇండియన్​ పాస్​పోర్ట్ ఉన్న వ్యక్తులు ప్రపంచంలోని 57 దేశాల్లో.. ఎలాంటి వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  1. కుక్ ఐలాండ్స్
  2. ఫిజీ
  3. మార్షల్​ ఐలాండ్స్
  4. మైక్రోనేషియా
  5. నియు
  6. పలావు ఐలాండ్స్​
  7. సమోవా​
  8. తువాలు
  9. వనాటు
  10. ఇరాన్​
  11. జోర్డాన్​
  12. ఒమన్​
  13. కతార్​
  14. బార్బడోస్​
  15. బ్రిటీష్​ వర్జిన్ ఐలాండ్స్​
  16. డొమినికా
  17. గ్రెనడా
  18. హైతీ
  19. జమైకా
  20. మోంట్సెరాట్​
  21. సెయింట్​ కిట్స్ అండ్​ నెవిస్​
  22. సెయింట్ లూసియా
  23. సెయింట్​ విన్సెంట్​ అండ్​ గ్రెనడైన్స్​
  24. ట్రినిడాడ్​ అండ్ టొబాగో
  25. భూటాన్​
  26. కంబోడియా
  27. ఇండోనేషియా
  28. కజకిస్థాన్​
  29. లావోస్​
  30. మకావో (SAR China)
  31. మాల్దీవ్స్​
  32. మయన్మార్​
  33. నేపాల్​
  34. శ్రీలంక
  35. థాయిలాండ్​
  36. తైమూర్​ - లెస్టే
  37. బొలీవియా
  38. ఎల్​ సాల్వడార్​
  39. బురుండీ
  40. కేప్​ వెర్డే ఐలాండ్స్​
  41. కొమోరో ఐలాండ్స్​
  42. జిబౌటీ
  43. గాబోన్​
  44. గినియా- బిస్సావు
  45. మడగాస్కర్​
  46. మౌరిటౌనియా
  47. మారిషస్​
  48. మొజాంబిక్​
  49. రువాండా
  50. సెనెగల్​
  51. సీషెల్స్​
  52. సియర్రా లియోన్​
  53. సోమాలియా
  54. టాంజానియా
  55. టోగో
  56. ట్యునీషియా
  57. జింబాబ్వే

భారతీయులకు శ్రీలంక స్వాగతం!
Sri Lanka Approves Visa Free Travel For Indians : ఇటీవలే శ్రీలంక క్యాబినెట్ వీసా-ఫ్రీ కంట్రీస్​ జాబితాలో భారతదేశాన్ని చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇకపై భారతీయ పాస్​పోర్ట్ ఉన్న ఎవరైనా సరే వీసా లేకుండా శ్రీలంకలో పర్యటించడానికి అవకాశం ఏర్పడింది. దీనితో 2022లో 87వ స్థానంలో ఉన్న ఇండియన్​ పాస్​పోర్ట్ స్ట్రెంగ్త్.. 2023లో 80వ స్థానానికి చేరుకుంది.

విదేశీ పర్యటనకు కావాల్సిన డాక్యుమెంట్స్!
List Of Documents Required For An Entry Visa : మీరు వీసా లేకుండా ఈ దేశాల్లో​ పర్యటించాలనుకుంటే.. ముందుగా ఆయా దేశాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరొక దరఖాస్తును ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​లో సబ్మిట్​ చేయాలి. అలాగే సంబంధిత అప్లికేషన్​ ఫీజు కూడా చెల్లించాలి. అంతే కాకుండా మీ దగ్గర కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా ఉండాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

  • వ్యాలీడ్​ ఇండియన్​ పాస్​పోర్ట్
  • విమానం టికెట్లు
  • వసతి వివరాలు
  • తగినంత మారక ద్రవ్యం (సదరు దేశ కరెన్సీ)
  • ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా ఉండాలి.

నోట్​ :ఆయా దేశాలను అనుసరించి నియమ, నిబంధనలు మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో కేవలం ఒక వారం మాత్రమే ఉండొచ్చు. కొన్ని దేశాల్లో 3 నెలల వరకు పర్యటించవచ్చు. అంటే ఆయా దేశాలను అనుసరించి మన బస వ్యవధి మారుతూ ఉంటుందని గుర్తించాలి.

What to Do If You Lost your Passport in Abroad : విదేశీ ప్రయాణంలో మీ పాస్​పోర్ట్ పోతే..? ఏం చేయాలి..?

How E-Passport Works and Its Benefits : ఈ-పాస్​పోర్ట్​ వచ్చేస్తోంది.. ఉపయోగాలు తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details