ETV Bharat / international

What to Do If You Lost your Passport in Abroad : విదేశీ ప్రయాణంలో మీ పాస్​పోర్ట్ పోతే..? ఏం చేయాలి..?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 2:31 PM IST

What to Do If You Lose Passport Abroad : మీరు విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రయాణానికి ముందు లేదా అక్కడికి వెళ్లాక ఒకవేళ మీరు పాస్​పోర్ట్​ను పోగొట్టుకున్నట్లయితే మేము ఈ స్టోరీలో చెప్పే ఈ ప్రక్రియ మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే సింపుల్​గా మీ కొత్త పాస్​పోర్ట్ కూడా పొందవచ్చు. మరి, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

What to Do If You Lost your Passport in Abroa
What to Do If You Lost your Passport in Abroa

What to Do If You Lose Passport in Foreign Tour : ప్రపంచంలో ఎవరైనా.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్​పోర్ట్ తప్పనిసరి. ఆయా దేశాలు ఇచ్చే పాస్‌‌పోర్ట్​తోనే ఆ వ్యక్తి వివరాలు తెలుస్తాయి. ఈ క్రమంలోనే మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు భారత ప్రభుత్వం(Indian Government) అధికారిక గుర్తింపు పత్రంగా ఈ పాస్​పోర్ట్​ను అందిస్తోంది. అయితే.. విదేశాలకు వెళ్లినప్పుడు దురదృష్టవశాత్తూ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. మరి, అలాంటప్పుడు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీ పాస్‌పోర్ట్ పోయినట్లయితే.. మొదటగా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, పాస్‌పోర్ట్ కార్యాలయానికి తెలియపరచాలి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ధ్రువీకరణ పత్రం తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే.. మీరు పాస్‌పోర్ట్ కోల్పోయినట్లు రుజువుగా ఆ కాపీ పనిచేస్తుంది. అలాగే.. కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం అప్లై చేయడానికి, రాయబార కార్యాలయంలో విషయం తెలియజేయడానికి పోలీసులు ఇచ్చిన నివేదిక మీకు సహాయపడుతుంది.

సమీపంలోని ఈ కార్యాలయాలను సంప్రదించాలి : ఆ తర్వాత సమీపంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి. ఎవరైనా విదేశాల్లో ఇరుక్కుపోయిన లేదా పాస్‌పోర్ట్ పోయినా ఇంకా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న పౌరులకు సహాయం చేయడానికి విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు సహాయం చేస్తాయి. అలాగే.. పాస్ పోర్ట్ తిరిగి పొందడానికి, ఆ ప్రక్రియను పూర్తి చేయటానికి వారు సహాయం చేస్తారు.

Precautions While Applying New Passport : పాస్​పోర్ట్​ దరఖాస్తులో పొరపాట్లు దొర్లుతున్నాయా.. చెక్ పెట్టండిలా..?

కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండిలా..

మీరు పాస్​పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో రెండు ఎంపికలు కలిగి ఉంటారు. వాటిలో మొదటిది కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవటం, రెండోది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందటం. ఒకవేళ మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికోసం కనీసం వారం రోజులు వేచి ఉండాలి. అలాగే డూప్లికేట్ పాస్ పోర్ట్ కాకుండా కొత్త నంబర్‌తో పాస్‌పోర్ట్ తాజా చెల్లుబాటు సమయంతో అందించటం జరుగుతుంది. అయితే.. కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే సమయంలో ఈ పత్రాలు అవసరం.

  • ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రం
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్ ఎలా ఎక్కడ పోయింది (లేదా) పాడైనట్లు తెలిపే అఫిడవిట్
  • పాస్​పోర్ట్ పోయినట్లు పోలీసు రిపోర్ట్

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కావాలంటే : కొత్త పాస్​పోర్ట్​ కోసం మీరు ఒక వారం పాటు వేచి ఉండలేకపోతే.. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రయాణ పత్రం పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయ పౌరుడు ఇండియాకి తిరిగి రావడానికి అనుమతి ఇవ్వడానికి ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ దరఖాస్తుకు కొన్ని పత్రాలు అవసరం.

  • పోగొట్టుకున్న పాస్‌పోర్ట్ కాపీ జిరాక్స్ (రెండు వైపులా)
  • పోలీసు నివేదిక కాపీ
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

How E-Passport Works and Its Benefits : ఈ-పాస్​పోర్ట్​ వచ్చేస్తోంది.. ఉపయోగాలు తెలుసా..?

వీసా మళ్లీ జారీ కోసం దరఖాస్తు : విదేశాల్లో మీ పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే.. మీరు కలిగి ఉన్న వీసాను కూడా కోల్పోతారు. అప్పుడు.. మీ వీసాను మొదట జారీ చేసిన సంబంధిత దేశ రాయబార కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా వీసాను తిరిగి పొందవచ్చు. అయితే.. ఇందుకు మీ పాత వీసా, పోలీసు రిపోర్ట్ కాపీ అవసరం ఉంటుంది.

చివరిగా మీ ప్రయాణ షెడ్యూలింగ్ : మీ ప్లైట్ జర్నీని(Flight Journey) రీషెడ్యూల్ చేసుకోవాలి. అలాగే ప్రయాణ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. పైన పేర్కొన్న విధంగా ప్రయాణ పత్రాలను పొందడానికి మీకు తగినంత సమయం లేకపోతే.. ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించాలి. ఈ క్రమంలో షెడ్యూల్ చేసిన విమానాన్ని అందుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ సహాయకారిగా ఉండవచ్చు. అయితే.. పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నప్పుడు వెంటనే మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని వీలైనంత త్వరగా సంప్రదించాలి. అలాగే.. పాస్‌పోర్ట్ కోల్పోవడం వల్ల అయ్యే ఖర్చులకు సంబంధించిన పోలీస్ రిపోర్ట్, రశీదులను మీ వద్ద ఉంచుకోవాలి.

How to Check Passport Status in Online : పాస్​పోర్ట్ స్టేటస్ ఎంతదాకా వచ్చింది.. మొబైల్​లో ఈజీగా చెక్ చేయండిలా..!

ఆధార్, ఓటర్, పాస్​పోర్ట్... ఇక అన్నింటికీ ఒకే ఐడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.