ETV Bharat / bharat

How to Check Passport Status in Online : పాస్​పోర్ట్ స్టేటస్ ఎంతదాకా వచ్చింది.. మొబైల్​లో ఈజీగా చెక్ చేయండిలా..!

author img

By

Published : Aug 18, 2023, 9:00 AM IST

Updated : Aug 18, 2023, 3:25 PM IST

How to Check Passport Status in Online : విదేశాలకు వెళ్లే వారు పాస్​పోర్టు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆప్లై చేశాక ఎన్ని రోజులకు పాస్​పోర్టు వస్తుందో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు లోను కాకుండా సింపుల్​గా మీ మొబైల్​లోనే సులభంగా పాస్​పోర్టు స్టేటస్​ను చెక్​చేసుకుని ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఎలాగో మీరే చూసేయండి..

How to Check Passport Status
Passport

How to Apply Passport in Online : ప్రపంచంలో ఎవరైనా విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకువెళ్లాలనుకుంటే కచ్చితంగా ఆ దేశ పాస్​పోర్ట్ కలిగి ఉండాల్సిందే. పాస్​పోర్టు అనేది సదరు వ్యక్తి ఏ దేశానికి చెందినవాడో తెలుపుతుంది. ఈ క్రమంలో భారతీయులు ఉన్నతవిద్య, వ్యాపారం కోసం విదేశాలకు ప్రయాణించడానికి తప్పనిసరిగా మన దేశ పాస్​పోర్ట్ కలిగి ఉండాలి. కనుక విదేశాలకు వెళ్లేముందు పాస్​పోర్టు(Indian Passport) రావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని దీనికి అప్లై చేసుకోవాలి. గతంలో పాస్​పోర్టు జారీకి బాగా సమయం పట్టేది. ఈ గడువును తగ్గించడం కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎంపాస్​పోర్ట్ పోలీస్ యాప్​ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆన్​లైన్​లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Check Passport Status in Telugu : మొదట పాస్​పోర్టు కోసం దరఖాస్తు(How to Apply Passport in Telugu) చేసే ముందు అందుకు కావాల్సిన పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకుని ఈ ఎంపాస్​పోర్ట్ పోలీస్ యాప్ ఓపెన్ చేసి అడిగిన వివరాలన్నీ సబ్మిట్ చేయాలి. అనంతరం పాస్​పోర్టు కోసం ఆన్​లైన్​లో రూ.1500 చెల్లించాలి. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పాస్​పోర్టు జారీకి ఈ యాప్ రాకముందు పోలీస్ వెరిఫికేషన్​ కోసమే సగం సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ఎంపాస్​పోర్ట్ పోలీస్ యాప్​(Mpassport Police App)తో ఆ గడువు చాలా వరకు తగ్గింది. అదేవిధంగా పాస్​పోర్టు జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం కేంద్రం పోస్టాఫీస్ పాస్​పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేంద్రాలను డిజీలాకర్​తో అనుసంధానించింది. దీనిద్వారా ఎలాంటి డాక్యుమెంట్​నైనా డిజిటల్ రూపంలో సమర్పించేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఇప్పుడు వేగంగానే పాస్​పోర్టు జారీ ప్రక్రియ కొనసాగుతోంది.

అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?

ఈ క్రమంలో మీరు పాస్​పోర్టు అప్లై చేసుకుని ఎప్పడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆన్​లైన్​లో సులువుగా మీ పాస్​పోర్టు స్టేటస్​ను సింపుల్​గా చెక్​చేసుకోండిలా..

పాస్​పోర్టు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు :

1. మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో ఆ పాస్​పోర్టు టైప్ తెలిసుండాలి.

2. పాస్​పోర్టు ఫైల్ నంబర్( మీరు దరఖాస్తు చేసుకున్నాక వచ్చే 15 అంకెల సంఖ్య)

3. దరఖాస్తు సమయంలో సమర్పించిన పుట్టిన తేదీ

ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

మీ పాస్​పోర్టు స్టేటస్​ను ఎలా చెక్​చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మొదట మీరు పాస్​పోర్టు అధికారిక వెబ్​సైట్ https://www.passportindia.gov.in లోకి వెళ్లాలి.

2. అప్పుడు అది ఓపెన్ కాగానే ఎడమ వైపు 'ట్రాక్ అప్లికేషన్ స్టేటస్' అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత మీకు సెలెక్ట్ అప్లికేషన్ టైప్​, ఫైల్ నంబర్, పట్టిన తేదీ అని మూడు బాక్సులు వస్తాయి.

4. అప్లికేషన్ టైప్​లో మీరు అక్కడ చూపించిన ఎంపికల నుంచి మీ పాస్​పోర్టు రకాన్ని ఎంచుకోవాలి.

5. ఫైల్​ నంబర్​లో దరఖాస్తు తదుపరి వచ్చిన 15 అంకెల నంబర్​ను టైప్ చేయాలి.

6. అప్లికేషన్​ సమయంలో మీరు ఇచ్చిన పుట్టిన తేదీని నమోదు చేయాలి.

7. చివరగా ట్రాక్ స్టేటస్​ బటన్​ను నొక్కడం ద్వారా మీ పాస్​పోర్టు అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్​పై కనబడుతుంది.

ఎప్పుడైతే మీరు సొంత పాస్​పోర్టు పొందుతారో అప్పుడు దేశ పాస్​పోర్టును గుర్తించే అన్ని దేశాలకు ప్రయాణం చేయవచ్చు. పాస్​పోర్టు దాదాపు 10 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది. అనంతరం తిరిగి దానిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ తప్పులు చేశారో.. పాస్​పోర్టు రావడం కష్టమే

ఒక్క పాస్​పోర్ట్​తో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు!

Last Updated :Aug 18, 2023, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.