FASTAG NEWS: ఫాస్టాగ్ నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యమా? టోల్గేట్తో సంబంధం లేకుండానే బ్యాలెన్స్ కట్ అవుతుందా? అద్దం తుడుస్తున్న ముసుగులో సరికొత్త దోపిడీకి పాల్పడుతున్నారా? ఫాస్టాగ్ బ్యాలెన్స్ చోరీపై వైరల్ వీడియోస్‌లో నిజమెంత? ఓ సారి తెలుసుకుందామా..
ఫాస్టాగ్‌ను స్కాన్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వద్ద నమోదైన టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా మర్చంట్స్‌కు మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లను స్కాన్ చేసి డబ్బులు తీసుకునే అధికారం ఉంటుందని తెలిపింది. అనధికార పరికరాలు ఏవీ ఫాస్టాగ్‌లోంచి డబ్బులు తీసుకోలేవని స్పష్టం చేసింది.