తెలంగాణ

telangana

హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి

By

Published : Oct 9, 2022, 7:35 AM IST

రవీంద్ర మేట్కర్​కు చెందిన పౌల్ట్రీ ఫారంలో అన్నీ ఆటోమేటిక్‌ వ్యవస్థలతో కూడిన అత్యాధునిక వసతులే. వేల సంఖ్యలో ఉన్న కోళ్లకు మేత వేయడం, వాటి విసర్జితాలు తొలగించడం, పెట్టిన గుడ్లు సేకరించడం.. ఇలా అన్ని పనులు యంత్రాలే చేస్తాయి. ఈ వసతులతో కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగిందని చెబుతున్నారు యజమాని.

modern poultry farm in india
హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి

రవీంద్ర మేట్కర్‌.. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ రైతు పౌల్ట్రీ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు. అమరావతి జిల్లాలోని అంజన్‌గావ్‌ బారీ గ్రామానికి చెందిన రవీంద్ర రోజూ రికార్డు స్థాయిలో లక్షా 20 వేల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. విదర్భ ప్రాంతంలో చుట్టుపక్కల మరెక్కడా ఈ స్థాయి ఉత్పత్తి లేదు.

Modern poultry farm in India : "మాతోశ్రీ పౌల్ట్రీ ఫారం" పేరిట ఈయన ప్రారంభించిన వ్యాపారానికి జాతీయస్థాయి గుర్తింపు సైతం లభించింది. ఈ పౌల్ట్రీ ఫారంలో అన్నీ ఆటోమేటిక్‌ వ్యవస్థలతో కూడిన అత్యాధునిక వసతులే. వేల సంఖ్యలో ఉన్న కోళ్లకు మేత వేయడం, వాటి విసర్జితాలు తొలగించడం, పెట్టిన గుడ్లు సేకరించడం.. ఇలా అన్ని పనులు యంత్రాలే చేస్తాయి. ఉష్ణోగ్రత పరంగా కోళ్లు ఇబ్బంది పడకుండా ఏసీ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా అపరిశుభ్రతకు చోటనేది లేదు.

హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి

ఈ వసతులతో కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగినట్లు రవీంద్ర మేట్కర్‌ "ఈటీవీ భారత్‌"కు తెలిపారు. "మాకు మార్కెటింగు సమస్య కూడా లేదు. కోడిగుడ్లన్నీ పౌల్ట్రీ ఫారం వద్దే అమ్మేస్తాం. భోపాల్‌, ఖాండ్వా, బెర్హాన్‌పుర్‌, ఇందోర్‌ వంటి నగరాలకు వీటిని తరలిస్తారు. గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి కూడా పంపుతుంటాం" అని వివరించారు.

హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి

ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణకు నిపుణులైన 50 మంది సిబ్బంది మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. కోళ్లకు రోజూ 13 టన్నుల ఆహారం అందిస్తారు. అన్నీ కలిపి రోజుకు రూ.3.5 లక్షల ఖర్చు ఉంటుంది. రవీంద్ర కృషికి గుర్తింపుగా పలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి అందించే ప్రతిష్ఠాత్మక జగ్జీవన్‌ రాం అభినవ్‌ కిసాన్‌ అవార్డు, జగ్జీవన్‌ రాం ఇన్నొవేటివ్‌ ఫార్మర్‌ అవార్డు-2021 వంటివి ఇందులో ఉన్నాయి.

హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
హైటెక్​ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
రవీంద్ర మేట్కర్‌

ABOUT THE AUTHOR

...view details