తెలంగాణ

telangana

మెక్​డొనాల్డ్స్ ఆఫీసు​లు క్లోజ్​.. భారీగా లేఆఫ్స్!.. ఏం జరుగుతోంది?

By

Published : Apr 3, 2023, 11:00 AM IST

Updated : Apr 3, 2023, 11:58 AM IST

దిగ్గజ ఫాస్ట్​ఫుడ్ సంస్థ మెక్​డొనాల్డ్స్.. అమెరికాలోని తమ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. అలాగే సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ​వాల్ స్ట్రీల్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.

mcdonalds offices shutdown in usa
mcdonalds offices shutdown in usa

ప్రముఖ ఫాస్ట్​పుడ్ దిగ్గజం మెక్​డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని మెక్​డొనాల్డ్స్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. కంపెనీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీల్ జర్నల్ కథనం ప్రచురించింది. సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులలో కొంతమందికి ఉద్వాసన తప్పదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గత వారం ఉద్యోగులకు మెక్​డొనాల్డ్స్​ కంపెనీ.. ఈ-మెయిల్ చేసిందని అందులోనే లేఆఫ్స్​కు సంబంధించి సూచనప్రాయంగా తెలియజేసిందని తెలిపింది.

'సోమవారం నుంచి బుధవారం వరకు​ ఇంటి నుంచే పనిచేయాలంటూ మెక్ డొనాల్డ్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు సూచించింది. ఈ వారంలో షెడ్యూల్డ్ మీటింగ్స్ మొత్తం రద్దు చేసుకోవాలని కోరింది.' అని వాల్​ స్ట్రీట్​ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.

లక్షలాది మంది ఉద్యోగులు తొలగింపు..
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, ఎరిక్సన్, ఫిలిప్స్​, యాహూ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. ఇటీవల ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 వేల మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ కూడా..
ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​లో పనిచేస్తున్న 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గత నెలలో ఆ సంస్థ సీఈఓ యాండీ జెస్సీ ప్రకటించారు. గత 2022 నవంబరు నుంచి అమెజాన్.. 18వేల మందిని తొలగించింది. తాజాగా కంపెనీ తీసుకున్న తొలగింపు నిర్ణయంతో.. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే తొలగింపులపై ఉద్యోగులకు సమాచారం ఇవ్వనున్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ తెలిపారు. ఏప్రిల్​లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

గూగుల్​ సైతం..
దిగ్గజ కంపెనీ గూగుల్​ కూడా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఫిబ్రవరిలో వెల్లడించింది. అందులో హైదరాబాద్​ గూగుల్​కు చెందిన స్టార్ పెర్ఫామర్​ కూడా ఉన్నారు. హర్ష్ విజయ్​వర్గీయ ఫిబ్రవరిలో హైదరాబాద్​ గూగుల్​లో స్టార్ పెర్ఫామర్​గా నిలిచారు. అయినా ఆయనను తొలగిస్తున్నట్లు సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారి ఆయన నిరాశకు గురయ్యారు.

డెల్ ఉద్యోగులకూ షాక్..​
ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్​ సంస్థ కూడా ఇటీవల తమ సంస్థలో 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5 శాతం అని కంపెనీ కో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్క్‌ వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 3, 2023, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details