తెలంగాణ

telangana

Best Post Office Insurance Schemes : 299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 3:10 PM IST

Postal Insurance Schemes : మానవ జీవితం తామరాకు మీద నీటిబొట్టు వంటిది. ఎప్పుడు జారిపోతుందో తెలియదు. అయితే.. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే.. ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్భందులు పడాల్సి వస్తుంది. అందుకే.. బీమా అనేది ఈ రోజుల్లో తప్పనిసరైపోయింది. మరి, కేవలం 299 రూపాయలకే పోస్టాఫీస్ అందిస్తున్న ఈ బీమా గురించి మీకు తెలుసా?

India Post Office Insurance Scheme
Post Office Insurance Scheme

India Post Office Insurance Scheme :కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన బాగా పెరిగింది. తమకు ఏమైనా జరిగితే.. కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో.. మంచి ఇన్సూరెన్స్ పాలసీలు ఎంపిక చేసుకుంటున్నారు. మరికొందరు టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి తీసుకుంటున్నారు. అయితే.. అవి భారం అని భావించే వాళ్లు బీమా చేయించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికోసమే.. పోస్టల్ డిపార్ట్ మెంట్ సరికొత్త పాలసీని అమలు చేస్తోంది. మరి, ఆ ఇన్సూరెన్స్(Health Insurance) పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

IPPB Accident Insurance Scheme Details : చాలా తక్కువ ప్రీమియంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌(India Post Payments Bank) సరికొత్త యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ దీనిని ప్రారంభించింది. ఇందులో సంవత్సరానికి రూ.299, రూ. 399 వంటి తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల బీమా పొందవచ్చు. ఇంతకీ ఈ పాలసీకి ఎవరెవరు అర్హులు, ఏ ప్రీమియం తీసుకుంటే ఏయే ప్రయోజనాలు అందుతాయో చూద్దాం.

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఈ పోస్టాఫీస్ బీమా పాలసీకి ఎవరెవరు అర్హులంటే..

Post Office Insurance Scheme Eligibilities :ఈ పాలసీని.. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ‍‌‍(India Post Payments Bank) ద్వారా మాత్రమే ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం చెల్లించాలి. అంటే ఈ బీమా పొందాలంటే తప్పనిసరిగా ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో అకౌంట్ ఉండాలి. అయితే రూ. 299, రూ. 399 అర్హతలు ఒకేవిధంగా ఉన్న పొందే ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రూ. 399 ప్రీమియం కడితే పొందే ప్రయోజనాలు చూద్దాం..

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

Benefits of Post Office Insurance Rs. 399 Policy :

ఈ పాలసీ ద్వారా పొందే ప్రయోజనాలివే..

  • ఈ పోస్టాఫీస్ బీమా పాలసీ తీసుకున్న వారికి ప్రమాదంలో మరణించినా.. శాశ్వత వైకల్యం ఏర్పడినా.. ఏదైనా అవయవం కోల్పోయినా.. పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
  • పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే.. ఇన్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌(IPD) కింద ఆ వ్యక్తికి రూ.60,000 లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది ఇస్తారు.
  • అలాగే ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్​మెంట్ (OPD) విషయంలో రూ. 30,000 లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది పాలసీదారునికి చెల్లిస్తారు.

Additional Benefits of Post Office Insurance Rs. 399 Policy :

ఈ పోస్టాఫీస్ బీమా పథకం ద్వారా అందే అదనపు ప్రయోజనాలు :

  • ఈ పాలసీలో విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు, ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు.
  • అలాగే ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.
  • ఆ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ. 25,000 లేదా అసలులో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ. 5,000 అందుతాయి.

రూ. 299 ప్రీమియం చెల్లించడం ద్వారా పొందే ప్రయోజనాలివే..

Benefits of Post Office Rs. 299 Insurance Policy :ప్రమాద రక్షణ పథకాన్ని 299 రూపాయల ప్రీమియంతోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని తీసుకున్న పాలసీదారు ఏడాదికి 299 రూపాయలు చెల్లించడంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటి రూ.399 ప్రీమియం ద్వారా అందే ప్రయోజనాలు అన్నీ అందుతాయి. కానీ పైన పేర్కొన్న అదనపు ప్రయోజనాలు పాలసీదారుడికి అందవు.

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్​ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్​!

30 వేల పోస్టల్ జాబ్స్.. టెన్త్ పాసైతే చాలు.. ఎంపికైతే ఫ్రీగా ల్యాప్​టాప్!

ABOUT THE AUTHOR

...view details