తెలంగాణ

telangana

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు- 16,500 దిగువన నిఫ్టీ

By

Published : Aug 20, 2021, 9:24 AM IST

Updated : Aug 20, 2021, 12:01 PM IST

stocks Live updates
స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​

11:55 August 20

ఆరంభంతో పోలిస్తే స్టాక్ మార్కెట్ల నష్టాలు కాస్త తగ్గాయి. సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా నష్టంతో 55,348 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా క్షీణించి 16,460 వద్ద కొనసాగుతోంది.

లోహ, ఫార్మ, బ్యాంకింగ్ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​ లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:12 August 20

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 410 పాయింట్లకుపైగా నష్టంతో.. 55,219 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 149 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16,419 వద్ద కొనసాగుతోంది. రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగుతుండటం సహా పలు పరిణామాలు నష్టాలకు  ప్రధాన కారణంగా  తెలుస్తోంది.

  • ఏషియన్​ పెయింట్స్​, హెచ్​యూఎల్​, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్​, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, డాక్టర్​ రెడ్డీస్​, ఎల్​&టీ, ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated : Aug 20, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details