తెలంగాణ

telangana

Stock Market: ఆర్థిక గణాంకాలు, ఆర్​బీఐ నిర్ణయాలే కీలకం!

By

Published : May 30, 2021, 2:09 PM IST

స్టాక్ మార్కెట్లను(Stock Market) ఈవారం.. స్థూల ఆర్థిక గణాంకాలు, ఆర్​బీఐ(RBI) ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ముందుకు నడిపించనున్నాయి. వీటన్నింటికి తోడు కరోనా సంబంధిత వార్తలు మార్కెట్లకు కీలకం కానున్నాయంటున్నారు విశ్లేషకులు.

Share market Updates
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్​

రెపో రేటుపై ఆర్​బీఐ(RBI) నిర్ణయాలు, మే నెలకు సంబంధించిన ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్లకు(Stock Market) ఈ వారం కీలకం కానున్నాయంటున్నారు విశ్లేషకులు.

'మే నెలకు సంబంధించి స్థూల ఆర్థిక గణాంకాలు, 2021 మొదటి త్రైమాసిక జీడీపీ(GDP) డేటా, తయారీ, సేవా రంగాల పీఎంఐ లెక్కలు ఈ వారమే విడుదలవనున్నాయి. స్టాక్ మార్కెట్లపై(Stock Market) వీటి ప్రభావం కీలకంగా ఉండనుంద'ని రెలిగేర్ బ్రోకింగ్ ఉపాధ్యక్షుడు (పరిశోధనా విభాగం) అజిత్​ మిశ్రా పేర్కొన్నారు. వీటికి తోడు వాహన విక్రయ గణాంకాలు, ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలు మార్కెట్లను ముందుకు నడిపించే కీలక అంశాలని వివరించారు. రెపో రేటు సహా సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్​బీఐ(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించనున్నారు.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు (Covid Cases) కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్రాల్లో దశల వారీగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి ఇవి సానుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.

వీటన్నింటికి తోడు.. రూపాయి హెచ్చుతగ్గులు, ముడి చమురు ధర, విదేశీ మదుపరుల సెంటిమెంట్, కరోనా వ్యాక్సిన్(Covid Vaccine) వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

గత వారం మార్కెట్ల గమనం సాగిందిలా..

గత వారం మొత్తం మీద బీఎస్​ఈ-సెన్సెక్స్ 882 పాయింట్లు బలపడింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఉన్న టాప్​ 10 కంపెనీల్లో.. 8 సంస్థల విలువ రూ.1,39,566.52 కోట్లు పెరిగింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్​ విలువ అత్యధికంగా.. రూ.59,590 కోట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్​ అత్యల్పంగా రూ.608 కోట్లు పెరిగింది.

ఇదీ చదవండి:1జీ నుంచి 5జీ వరకు- ప్రయాణం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details