తెలంగాణ

telangana

ఇంట్లోనే కొవిడ్​ చికిత్స- బీమా పరిహారం పొందడమెలా?

By

Published : May 21, 2021, 9:00 AM IST

కరోనా విజృంభణతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడమూ కష్టమయ్యింది. దీంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య బీమా ఉన్నవారు ఇలాంటి సందర్భాల్లో పరిహారం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ వివరాలు మీకోసం...

Health insurance
ఆరోగ్య బీమా పాలసీ, ఇన్సూరెన్స్​ పాలసీ

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు పలు ఆసుపత్రులు హోం కేర్‌ ట్రీట్‌మెంట్‌ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలనూ రూపొందించాయి. ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నవారు ఈ చికిత్సకూ పరిహారం పొందే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని బీమా సంస్థలూ ఇంటి వద్ద చికిత్సకు అనుమతించడం లేదు. కాబట్టి, ముందుగా మీ బీమా కంపెనీని సంప్రదించి ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.

ఏయే పత్రాలు అవసరం..

ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు కరోనా మహమ్మారి అంటుకుంటుందో తెలియని ఆందోళన. అందుకే మిగతా విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో.. ఆరోగ్య బీమా పాలసీ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. మీ పాలసీ క్యాష్‌లెస్‌ కార్డు, ఆధార్‌ ఇతర గుర్తింపు పత్రాలన్నింటినీ ఒక చోట పెట్టుకోండి. కుటుంబ సభ్యులందరి కార్డులూ ఒకే చోట ఉండేలా చూసుకోండి. ఫోన్లలోనూ ఆ వివరాలు ఉంచుకోండి.
  2. ఇప్పటి వరకూ ఏదైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే.. ఆ పత్రాలూ దగ్గర పెట్టుకోండి.
  3. ఐసీఎంఆర్‌ అధీకృత పరీక్షా కేంద్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్న వివరాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఆ నివేదిక కాపీని బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది.
  4. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా డాక్టర్‌ సూచన, దానికి సంబంధించి ఆసుపత్రి ప్యాకేజీ వివరాలు బీమా సంస్థకు పంపించాలి.
    పాలసీ క్లెయిమ్న​కు సంబంధించిన అనుమానాలుంటే.. బీమా సంస్థ అధీకృత సేవా కేంద్రం లేదా సహాయం కోసం మీ బీమా సలహాదారును సంప్రదించాలి.

ఇదీ చదవండి:ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..

ABOUT THE AUTHOR

...view details