తెలంగాణ

telangana

17 ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు

By

Published : Jun 28, 2019, 6:06 AM IST

Updated : Jun 28, 2019, 1:23 PM IST

పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల బాలుడు అసహజ లైంగిక దాడి చేశాడు. తర్వాత ఇనుప పైపుతో విచక్షణరహితంగా కొట్టి చంపాడు. సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఎనిమిది రోజులు ఎవరికీ కనపడకుండా దాచాడు. కేసును విచారించిన చిన్నారి మిత్ర కోర్టు సదరు మైనర్​ నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

17 ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు

పదేళ్ల బాలుడిపై మరో బాలుడు అసహజ లైంగిక దాడి చేసిన కేసులో చిన్నారి మిత్ర కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాతబస్తీలోని బార్కాస్‌ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు... పదేళ్ల బాలుడిని ఆడుకుందామంటూ తన వెంట తీసుకువెళ్లి స్థానిక ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు మీద అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇనుప పైపుతో కొట్టి హతమార్చాడు. సాక్ష్యాలు లేకుండా చేశాడు. బాలుడి మృతదేహాన్ని ఎనిమిది రోజుల పాటు ఎవరి కంట పడకుండా దాచాడు. ఈ కేసును విచారించిన కోర్టు 17 ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తరహా శిక్ష విధించడం ఇదే తొలిసారి.

sample description
Last Updated :Jun 28, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details