తెలంగాణ

telangana

CDS Helicopter Crash: ట్రై సర్వీస్ విచారణ అంటే?

By

Published : Dec 10, 2021, 10:23 PM IST

tri service inquiry: యావత్‌ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ (63) మృతిచెందిన ఘటనపై ట్రై-సర్వీస్ విచారణకు ఆదేశించినట్లు పార్లమెంట్​లో తెలిపారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను కనుక్కోవాల్సిందిగా సూచించారు.

tri-service enquary
ట్రై సర్వీస్

CDS Bipin Rawat Death: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్రై-సర్వీస్‌ విచారణకు ఆదేశించారు. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ మొదలైంది.

ట్రై-సర్వీస్ విచారణ అంటే?

అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరణించిన ఘటనల్లో ఆర్మీ, నౌకాదళ, వాయుసేనకు చెందిన మూడు విభాగాలు సంయుక్త విచారణ చేపడతాయి. త్రిదళాల నుంచి ఎంపిక చేసిన సైనిక సిబ్బందితో విచారణ నిర్వహించేందుకు ఓ కమిటీని నియమిస్తారని బ్రిగేడియర్ డాక్టర్ బీ.కే. ఖన్నా తెలిపారు.

"ఈ విచారణలో బ్లాక్ బాక్స్, హెలికాప్టర్‌ శిథిలాలపై సమగ్ర విచారణ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో.. మానవ తప్పిదం, యాంత్రిక లోపం, వాతావరణ పరిస్థితులు, తీవ్రవాద దాడి అనే నాలుగు ముఖ్యమైన అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తాం"

-- డాక్టర్ బీ.కే. ఖన్నా, బ్రిగేడియర్

Bipin Rawat Helicopter Incident: 'సాధారణంగా హెలికాప్టర్ క్రాష్​కు సంబంధించిన విచారణను వైమానిక దళ అధికారులు మాత్రమే చేస్తారు. అయితే మరణించిన వ్యక్తుల జాబితాలో సీడీఎస్ ఉన్నందున.. ట్రై-సర్వీస్ విచారణకు ఆదేశాలు అందాయి' అని ఖన్నా తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదం జరగడానికి ముందు చివరి నిమిషాల్లో జరిగిన కీలక వివరాలను బ్లాక్ బాక్స్ రికార్డు చేస్తుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details