తెలంగాణ

telangana

UPSC నుంచి భారీ నోటిఫికేషన్.. ఏడేళ్లలో అత్యధిక పోస్టులు.. అప్లై చేయండిలా..

By

Published : Feb 2, 2023, 2:27 PM IST

2023 సంవత్సరానికి యూపీఎస్సీ 1105 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఏడేళ్లలో ఇదే అత్యధిక పోస్టులున్న నోటిఫికేషన్​ ఇదే. మరిన్ని వివరాలు ఇలా...

upsc civil services latest notification 2023
upsc civil services latest notification 2023

ఉద్యోగార్థులకు యూపీఎస్సీ శుభవార్త చెప్పింది. సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం, తదితర వివరాలను వెల్లడించింది. ఇటీవల కాలంలో ఇండియన్​ రైల్వే మేనేజ్​మెంట్ సర్వీసేస్​ పరీక్షను సివిల్​ సర్వీసెస్​తో కలిపి నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో యూపీఎస్సీలో ఈసారి ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన ఏడేళ్లలో యూపీఎస్సీ నుంచి వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్​ ఇదే.

కాగా, ఈ నోటిఫికేషన్​లో మొత్తంగా 1105 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది యూపీఎస్సీ. 2016లో 1209 పోస్టులను విడుదల చేసింది. ఆ తర్వాత కమిషన్ పోస్టులను తగ్గిస్తూ వస్తోంది. గత సంవత్సరం యూపీఎస్సీ 806 పోస్టులకు నోటిఫికేషన్​ను జారీ చేయగా.. ఐఆర్​ఎమ్​ఎస్​ (ఇండియన్ రైల్వే మేనేజ్​మెంట్ సర్వీసెస్) గ్రూప్​ 'ఎ'కు సంబంధించిన 150 పోస్టులను అందులో కలిపారు. దీంతో ఆ ఏడాది మొత్తం 1011 ఖాళీలకు నోటిఫికేషన్​ను జారీ చేసింది యూపీఎస్సీ. ఆ తర్వాత 2023లోనే అత్యధిక ఖాళీలతో నోటిఫికేషన్​ను జారీ చేసింది.

ఈ పోస్టుల కోసమే..
యూపీఎస్సీ ప్రభుత్వంలోని ప్రధాన పాత్ర పోషించే గ్రూప్ ఎ, బీ లెవల్​ అధికారులను రిక్రూట్ చేసుకోవడానికి పరీక్షను నిర్వహిస్తుంది. పరిపాలనా విభాగంలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్, ఐఆర్ఎస్ లాంటి పోస్టులకు పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష మూడు దశలలో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలను దాటిన అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ వివరాలు

పోస్టులు 1105
సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్​ఎమ్​ఎస్
అప్లికేషన్ ప్రారంభ తేది 2023, ఫిబ్రవరి1
చివరి తేదీ ఫిబ్రవరి 21(సాయంత్రం 6 వరకు)
అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి అయి ఉండాలి(50శాతం మార్కులతో)
వయస్సు 21-32సంవత్సరాలు
ఫీజు(జనరల్) రూ.100
ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ, మహిళలకు ఫీజు లేదు
ఎగ్జామ్​ మోడ్ ఆన్​లైన్
వెబ్​సైట్ upsc.gov.in

యూపీఎస్సీ పరీక్షల తేదీలు

ఈవెంట్ పేరు ముఖ్యమైన తేదీలు
యూపీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి 1, 2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేది ఫిబ్రవరి 21, 2023
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 21, 2023
దరఖాస్తులో తప్పుల సవరణకు గడువు ఫిబ్రవరి 22, 2023
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ మే 28, 2023
ప్రిలిమ్స్ ఫలితాలు జూన్ 2023
యూపీఎస్సీ మెయిన్స్ సెప్టెంబర్ 15, 2023
  • అప్లికేషన్​ ఫామ్​ను ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్​ చేశాక మళ్లీ మార్చడానికి వీలుండదు.

ABOUT THE AUTHOR

...view details