తెలంగాణ

telangana

యూపీ సీఎం యోగి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

By

Published : Feb 5, 2022, 8:57 AM IST

Updated : Feb 5, 2022, 12:30 PM IST

Yogi Adityanath Assets: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తనకు రూ.కోటి 54 లక్షల 94 వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు. వీటితోపాటు రూ.12వేలు విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ. లక్ష విలువగల రివాల్వర్‌, రూ.80 విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు వెల్లడించారు.

UP CM Yogi adityanath assets
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​

UP CM Yogi adityanath: ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గోరఖ్‌పుర్‌ శాసనసభస్థానం నుంచి శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు. ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, లక్ష రూపాయల విలువగల రివాల్వర్‌, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

Yogi Adityanath Nomination

49 వేల రూపాయల విలువగల బంగారు చెవి రింగు, రూ.20వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యూపీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు. పెండింగ్‌లోనూ ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్‌లో యోగీ పొందుపరిచారు.

Akhilesh Yadav Assets

మరోవైపు ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తనకు 17.22 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Up Election 2022: భాజపాకు సై.. యోగికి నై!

Last Updated :Feb 5, 2022, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details