తెలంగాణ

telangana

పెళ్లైన నాలుగో రోజే ప్రమాదం- నవదంపతులు మృతి

By

Published : Nov 1, 2021, 8:42 PM IST

Updated : Nov 1, 2021, 9:28 PM IST

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నవ దంపతులను బలితీసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

road accident
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవ దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.

ప్రయాణం విషాదం..

రాణిపేట జిల్లా అరక్కోణంకు చెందిన మనోజ్‌కుమార్‌కు (31), డాక్టర్ కార్తీకతో(30) అక్టోబర్‌ 28న వివాహం జరిగింది. నవ దంపతులైన వీరు చెన్నై నుంచి మనోజ్​కుమార్ స్వస్థలానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో అనుకోని విధంగా వీరి కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీనితో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు

ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

ప్రమాద తీవ్రతకు నవదంపతుల కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు చూపరులను కలసివేశాయి.

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2021, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details