తెలంగాణ

telangana

కొట్టేసిన షాపులోనే 'పాల ప్యాకెట్లు' అమ్ముతూ దొరికిపోయిన దొంగ.. చితకబాదిన యజమానులు​

By

Published : Oct 7, 2022, 12:30 PM IST

సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తే దొరకకుండా ఉండేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తారు. దొంగలించిన వస్తువులను వీలైనంత దూరంగా వెళ్లి అక్కడ అమ్ముతారు. కానీ బెంగళూరులోని ఓ దొంగ మాత్రం తాను దొంగలించిన పాల ప్యాకెట్లను అదే షాపులో అమ్ముతూ దొరికిపోయాడు.

milk theif caught in banglore
milk theif in banglore

కొట్టేసిన షాపులోనే పాల ప్యాకెట్లు అమ్ముతూ దొరికిపోయిన దొంగ

కొట్టేసిన పాల ప్యాకెట్లను అదే షాపులో అమ్ముతూ దొరికిపోయాడు ఓ వ్యక్తి. వెంటనే దుకాణ యజమానులంతా గుమగూడి దొంగను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బెంగళూరులోని జరిగింది.
అసలేం జరిగిందంటే?
రోజుకొక దుకాణంలో పాల ప్యాకెట్లను దొంగలించి.. అనుమానం రాకుండా ఉండేందుకు తిరిగి ఆ షాపు యజమానులకే అమ్మేస్తున్నాడు ఓ వ్యక్తి. ఇలా కొన్ని రోజులు ఆడుతూ పాడుతూ హాయిగా గడిపాడు. ఎవరి కంట పడట్లేదన్న ధీమాతో స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించాడు. అయితే తమ షాపుకు రావాల్సిన పాల ప్యాకెట్లు మాయపోతున్నాయన్న విషయం గ్రహించినప్పటికి దాని వెనకాల ఎవరి హస్తం ఉందో దుకాణదారులకు అర్థం కాలేదు.

ఓ రోజు తమ షాపుల సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు దుకాణదారులు. దీంతో దొంగ ఇట్టే దొరికిపోయాడు. తర్వాత రోజు షాపు దగ్గరకి వస్తే దొంగను పట్టుకోవాలని దుకాణదారులు నిర్ణయించుకున్నారు. అయితే యథావిధిగా దొంగ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత పాల ప్యాకెట్లను తీసుకెళ్లి అదే షాపులో అమ్మాడు. వెంటనే దొంగను గుర్తుపట్టిన షాప్​ యజమాని అతడ్ని పట్టుకున్నాడు. అందరూ గుమిగూడి చితకబాది పోలీసులుకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details