తెలంగాణ

telangana

భారత్​ తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్​.వెంకటరమణి

By

Published : Sep 28, 2022, 9:56 PM IST

Updated : Sep 28, 2022, 10:03 PM IST

Senior advocate R Venkataramani appointed as the new Attorney General of India for a period of three years.
Senior advocate R Venkataramani appointed as the new Attorney General of India for a period of three years.

భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత అటార్నీ జనరల్​గా ఉన్న కేకే వేణుగోపాల్​ పదవీకాలం ఈ నెల 30న ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసింది.

General Attorney Of India: భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణి(91) నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయనను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు. దీంతో ఆయన స్థానంలో వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.

అయితే అటార్నీ జనరల్ పదవిని చేపట్టాలని మరో సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్​ రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. అందుకు ఆయన అంగీకరించలేదు. రోహత్గీ ఇదివరకు 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా కొనసాగారు. అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా తిరస్కరించారు.

దాంతో 86 ఏళ్ల వయస్సులో కేకే వేణుగోపాల్‌ను మూడేళ్ల కాలానికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది. తర్వాత ఆయన్నే కొనసాగించింది. జూలై 2017లో ఆ పదవికి నియమితులయ్యారు. జూన్ 29న మూడు నెలల పాటు దేశ అత్యున్నత న్యాయ అధికారిగా మళ్లీ నియమితులయ్యారు.

ఇదీ చదవండి:త్రిదళాధిపతిగా అనిల్ చౌహాన్.. బిపిన్ రావత్ స్థానం భర్తీ

Last Updated :Sep 28, 2022, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details