ETV Bharat / sports

RCB ప్లేఆఫ్స్​ సెలబ్రేషన్స్- ప్లేయర్ల కంటే ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్- నెట్టింట ట్రెండింగ్! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 7:50 AM IST

Updated : May 19, 2024, 8:44 AM IST

RCB Playoffs Celebrations:2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్​కు చేరుకుంది. ఇక మే 22న జరగనున్న ఎలిమినేటర్​ మ్యాచ్​లో ఆర్స్బీ ఆడనుంది. దీంతో అర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

RCB Playoffs Celebrations
RCB Playoffs Celebrations (Source: Associated Press)

RCB Playoffs Celebrations: 2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమే చేసింది. సీజన్​లో తొలి 8మ్యాచ్​ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి చేరుకుంది. టోర్నీ సగం పూర్తైయ్యే నాటికి ఆర్సీబీ సాధించింది ఒక్క విజయమే. నెట్​రన్​రేట్ కూడా మైనస్​లోనే ఉంది. అప్పటికే నాలుగేసి విజయాలు అందుకున్న జట్లు 6 ఉన్నాయి. దీంతో ఆర్సీబీ ఇక ప్లేఆఫ్స్​కు చేరకుండానే ఇంటిబాట పట్టడం ఖాయమనుకున్నారంతా.

కానీ, ఆ తర్వాత అద్భుతమే జరిగింది. ఆడిన ఐదు మ్యాచ్​ల్లో వరుసగా అన్నింట్లోనూ విజయం సాధించి ప్లేఆఫ్స్​ రేసులో కీలక జట్టుగా నిలిచింది. ఇక నాకౌట్​కు చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్​కు రెడీ అవుతున్న తరుణంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. వర్షం ఆందోళన రేకెత్తించింది. అయినప్పటికీ లక్షలాది మంది అభిమానుల మద్దతుతో, వాతావరణం కూడా సహకరించిన వేళ ఆర్సీబీ శనివారం చిన్నస్వామి స్టేడియంలో అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్​పై 27 పరుగుల తేడాతో నెగ్గి సగర్వంగా ప్లే ఆఫ్స్​కు ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించింది.

దీంతో ఒక్కసారిగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోపాటు ఆటగాళ్లు, ప్రేక్షకులు, అభిమానులంతా ఎమోషనల్ అయ్యారు. ఎట్టకేలకు ఆర్సీబీ ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టిందని సంబరాలు చేసుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ పీక్స్​లో ఉన్నాయి. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు మీరు చూశారా?

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగుల స్కోర్ చేశారు. ఫాప్ డుప్లెసిస్‌(54 పరుగులు, 39 బంతుల్లో) హాఫ్ సెంచరీతో మెరవగా విరాట్ కోహ్లీ(47 పరుగులు, 29 బంతుల్లో), ర‌జత్ పాటిదార్‌(41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (38 *) రాణించారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో చెన్నై ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (61 పరుగులు) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లంతా ఫెయిలయ్యారు.

ఉత్కంఠ పోరులో సీఎస్కేకు షాక్​ - ప్లే ఆఫ్స్​కు ఆర్సీబీ - IPL 2024 CSK VS RCB

'రోహిత్ చెప్పింది కరెక్ట్​ - అతడి మాటలను నేను ఏకీభవిస్తున్నాను' - Kohli T20 World Cup

Last Updated : May 19, 2024, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.