తెలంగాణ

telangana

Road Accident in Outer Ring Road : ఔటర్ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Jul 17, 2023, 10:09 AM IST

Updated : Jul 17, 2023, 2:59 PM IST

Road Accident
Road Accident

10:02 July 17

లారీ అదుపు తప్పి బొలెరో, కారును ఢీకొని ముగ్గురు మృతి

Road Accident in Shamirpet :నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరని పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా.. ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటిపై అధికారులు, పోలీసులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా వారు ప్రమాదాల బారిన పడటంతో పాటు వేరే కుటుంబాలనూ అంధకారంలోకి నెట్టివేస్తున్నారు.

Road Accident in Outer Ring Road : తాజాగా హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డుపై.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై.. ఘట్‌కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే డివైడర్ పై నుంచి ఎగిరి అటుగా వస్తున్న బొలెరో, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన నర్సింహగా పోలీసులు గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలో బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Warangal Road Accident Today :వరంగల్​ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సును, ఓ డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలోఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిలోడుతో తొర్రూర్‌ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం.. ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం నడుపుతున్న డ్రైవర్‌ రాజేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే వాహనంలో ఉన్న నలుగురు మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు.

ఇవీ చదవండి:Adilabad Road Accident Today : ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Karimnagar Road Accident : ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న ఇసుక ట్రాక్టర్

Last Updated : Jul 17, 2023, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details