తెలంగాణ

telangana

నీళ్ల డ్రమ్ములకు తాళాలు.. ఇదేం దుస్థితి!

By

Published : Jun 11, 2021, 11:31 AM IST

Updated : Jun 11, 2021, 11:48 AM IST

రాజస్థాన్​ అజ్​మేర్​ గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నీళ్లున్న డ్రమ్ములకు తాళాలు వేసి అక్కడి ప్రజలు దాచుకుంటున్నారు. అధికారులు తమ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని వారు కోరుతున్నారు.

lock to water
రాజస్థాన్​లో నీటి ఎద్దడి

నీళ్ల డ్రమ్ములకు తాళం

ఎవరైనా బంగారం, ధనాన్ని భద్రపరచాలంటే పెట్టెకు తాళాలు వేసి దాచుకుంటారు. కానీ, నీళ్లు ఉండే డమ్ముకు తాళమేసి దాచుకున్న సంఘటనలు ఎప్పుడైనా విన్నారా? రాజస్థాన్​ అజ్​మేర్​కు వెళితే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. నీటి కొరతతో అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. గడ్డు పరిస్థితుల్లో.. ఇతరులెవరూ నీళ్లను దొంగిలించకుండా ఉండేందుకే ఇలా తాళమేసి భద్రపరుస్తున్నామని వారు చెబుతున్నారు.

నీటి డ్రమ్ముకు తాళమేసిన దృశ్యం
అజ్​మేర్​లో నీటి ఇక్కట్లు
నీళ్ల కోసం బిందెలు, క్యానులతో వస్తున్న మహిళ

"12ఏళ్లుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్ల ట్యాంకర్​ ఇక్కడకు వస్తుంది. మేము మా క్యానుల్లో నీళ్లను నింపుకుని ఎవరూ ఎత్తుకెళ్లకుండా తాళాలు వేస్తున్నాం," అని స్థానిక మహిళ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

Last Updated : Jun 11, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details