తెలంగాణ

telangana

Rain in Hyderabad Today : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. రేపు ఉదయం వరకూ కురిసే అవకాశం

By

Published : Jul 31, 2023, 4:58 PM IST

Updated : Jul 31, 2023, 6:49 PM IST

Rain in Hyderabad
Rain in Hyderabad

16:50 July 31

వర్షాలపై హైదరాబాద్‌ వాసులను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad Rain Today :హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వానహోరుతో రహదారులన్నీ జలమయం కాగా.. వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్‌, రహమత్‌నగర్‌, బోరబండ, రాంనగర్‌, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, నారాయణగూడ, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.

Rain in Hyderabad Today :బేగంబజార్, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్​, లక్డీకపూల్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలోనూ వర్షం కురిసింది. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, మల్లేపల్లి, ముషీరాబాద్, ఆర్డీసీ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. బాగ్‌లింగంపల్లి, దోమలగూడ, కవాడిగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, రాంనగర్‌, అల్లాపూర్, బోరబండ, మోతీనగర్, సనత్‌నగర్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, రహమత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది.

Rain in Hyderabad Today :యూసఫ్‌గూడ, వెంగళరావునగర్, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఓయూ క్యాంపస్‌, తార్నాక, లాలాపేట్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్‌లో వర్షం మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, సైదాబాద్‌, మాదన్నపేట్‌, సంతోష్‌నగర్‌, కాంచన్‌బాగ్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. జోరు వర్షానికి వరద నీరు రహదారులపైకి రావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి.

Hyderabad Trafic in Rain :లక్డీకాపూల్, సైఫాబాద్, మాసబ్‌ట్యాంక్‌ మార్గంలో.. చాదర్‌ఘాట్‌-మలక్‌పేట్‌ మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వాన కారణంగా వాహనాలు నడపడం కష్టమవుతుందని తెలిపారు. వాహనాలను నడిపేటపుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్ష తీవ్రత మేరకు ప్రయాణాల ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, వర్షాలపై హైదరాబాద్‌ వాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రేపు ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సహాయక చర్యల కోసం 040 21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Today Weather Updates Telangana :మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీగా వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది.

గత సంవత్సరం జూన్‌ నుంచి జులై 30 వరకు 687.1 మిల్లీమీటర్ల వాన పడగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. జులైలో నిర్మల్‌ మండలంలో అత్యధికంగా 16.5 మిల్లీమీటర్ల వర్షం పడగా.. కరీంనగర్‌ గ్రామీణ మండలంలో 16, నిర్మల్‌ గ్రామీణ మండలంలో 14.9, ఖానాపూర్​లో 13.1, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 12.6, రాయికల్​లో 10.3, జగిత్యాల గ్రామీణ మండలంలో 10.2, నిర్మల్‌ జిల్లా లక్ష్మణ్‌చాందలో 9.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 8, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 7.5 మిల్లీమీటర్ల వర్షం పడిందని వెల్లడించింది.

ఇవీ చదవండి :Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. తడిసి ముద్దైన జనం

Hail Rain in Hyderabad: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం

Last Updated : Jul 31, 2023, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details