తెలంగాణ

telangana

'2-3 నెలల్లో నాకు మరింత జ్ఞానం వస్తుంది'

By

Published : Sep 9, 2022, 4:41 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కొనసాగుతోంది. కేంద్రంలోని భాజపా, ఆర్​ఎస్​ఎస్.. విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. అవి దేశానికి చేసే నష్టాన్ని పూడ్చడానికే జోడో యాత్ర చేస్తున్నానని తెలిపారు. పార్టీ ఎన్నికలప్పుడు తాను అధ్యక్షుడ్ని అవుతానా లేదా తెేలుతుందని అన్నారు.

Rahul Gandhi bharat jodo yatra
రాహుల్ గాంధీ

Rahul Gandhi Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలన్న నినాదంతో.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమిళనాడు కన్యాకుమారిలోని నాగర్​కోయిల్​లో రాహుల్ పాదయాత్ర చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడంపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు తాను అధ్యక్షున్ని అవుతానా లేదా అన్నది తేలుతుందన్నారు. అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న రాహుల్‌గాంధీ.. ఆ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టంచేశారు. భారత్‌ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదని తేల్చి చెప్పారు. "ఈ యాత్ర ద్వారా నేనేంటో, ఈ దేశమేంటో నాకు కొంత అర్థమవుతుంది. రానున్న 2-3 నెలల్లో నేను మరింత తెలివిగా మారతాను" అని రిపోర్టర్లతో రాహుల్ అనగానే.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.

భారత్​ జోడో యాత్ర.. కాంగ్రెస్‌ పార్టీ యాత్ర. యాత్రలో పాల్గొనేందుకు పాక్షికంగా ఒప్పుకున్నా. ఎందుకంటే కాంగ్రెస్‌ సిద్ధాంతాలను నేను విశ్వసిస్తాను. ఈ యాత్ర ద్వారా వ్యక్తిగతంగా మంచి అనుభవం వస్తుందని భావిస్తున్నా. 2-3 నెలల తర్వాత నాకు మరింత జ్ఞానం వస్తుంది. దేశంలో భాజపా, ఆర్​ఎస్​ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయి. అవి దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చడానికే భారత్ జోడో యాత్ర చేపడుతున్నాం. నేను యాత్రకు నాయకత్వం వహించడం లేదు. యాత్రలో పాల్గొంటున్నా. దేశం కోసం పని చేయడం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజా సమస్యలను తెలుసుకుని వారితో మమేకమవ్వడమే భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం. దేశంలోని దర్యాప్తు సంస్థలను భాజపా తన గుప్పిట్లోకి తీసుకుంది.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

భారత్ జోడో యాత్రలో రాహుల్
.
ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ
.

అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్‌ను గాడినపెట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళ్తారు. రోజూ రెండు విడతల్లో.. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పాదయాత్ర జరగనుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియమితులయ్యారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయని పార్టీ వర్గాల కొద్ది రోజుల క్రితం తెలిపాయి. అక్టోబర్ 19న అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటస్తామని పేర్కొన్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని స్పష్టం చేశాయి.

ఇవీ చదవండి:పాత్రికేయుడు కప్పన్​కు ఎట్టకేలకు బెయిల్

విద్యార్థిపై టీచర్ దారుణం.. వేడినీళ్లతో దాడి.. కేసు పెట్టకుండా పెద్దలపై ఒత్తిడి!

ABOUT THE AUTHOR

...view details