ETV Bharat / bharat

విద్యార్థిపై టీచర్ దారుణం.. వేడినీళ్లతో దాడి.. కేసు పెట్టకుండా పెద్దలపై ఒత్తిడి!

author img

By

Published : Sep 9, 2022, 1:20 PM IST

ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. యూనిఫాంలో మలవిసర్జన చేశాడని రెండో తరగతి విద్యార్థిపై వేడి నీళ్లు పోశాడు. దీంతో బాలుడి శరీరం 40 శాతం కాలిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Teacher threw hot water
విద్యార్థిపై టీచర్ దాడి

కర్ణాటక రాయచూర్​లో అమానవీయ ఘటన జరిగింది. యూనిఫాంలో మలవిసర్జన చేశాడని ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థి శరీరంపై వేడినీళ్లు పోసేశాడు. దీంతో విద్యార్థి శరీరం 40శాతం కాలిపోయింది.
సంతకళ్లూరులోని శ్రీగణమాతేశ్వర ప్రైమరీ పాఠశాలలో బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన బాలుడు.. లింగసుగూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబరు 2న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలుడిపై దాడికి పాల్పడిన రోజు నుంచి ఉపాధ్యాయుడు హుళిగెప్ప పాఠశాలకు రావట్లేదని సమాచారం. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కాలేదు. అతడిపై ఫిర్యాదు చేయవద్దని టీచర్ తరఫు పెద్ద మనుషులు బాలుడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి: మద్యం సేవించి స్కూల్​కు టీచర్​.. విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరమే: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.