తెలంగాణ

telangana

పంజాబ్​ సీఎం మరో కీలక నిర్ణయం.. వారికి భద్రత కట్

By

Published : Apr 24, 2022, 4:21 AM IST

Punjab Security Withdrawn: 184 మంది ప్రముఖులకు భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది పంజాబ్​ ప్రభుత్వం. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కుటుంబ సభ్యులతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

Punjab Security Withdrawn
Punjab Security Withdrawn

Punjab Security Withdrawn: ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో 184 మంది ప్రముఖులకు భద్రతను ఉపసంహరించుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రైవేటు వ్యక్తుల భద్రతను తొలగించింది. భద్రతా విభాగం సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

భద్రత పొందుతున్న ప్రముఖులకు ప్రస్తుతం ఉన్న ముప్పునకు సంబంధించి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం భద్రతా విభాగం సూచనలతో సెక్యూరిటీని తొలగించినట్టు ఈ నెల 20న రాసిన లేఖలో అదనపు డీజీపీ (సెక్యూరిటీ) పేర్కొన్నారు. భద్రత తొలగించిన ప్రముఖుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కుటుంబ సభ్యులతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నవారి భద్రత మాత్రం కొనసాగించారు.

ఇదీ చూడండి :పదేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details