తెలంగాణ

telangana

క్రిప్టోకరెన్సీతో ఉగ్రవాదులకు నిధులు చేరే ముప్పు..త్వరలో కేంద్రం చర్యలు!

By

Published : Nov 13, 2021, 9:57 PM IST

Updated : Nov 14, 2021, 12:14 PM IST

pm
మోదీ

క్రిప్టోకరెన్సీతో(cryptocurrency news) ఎదురవుతున్న సవాళ్లపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. శరవేగంగా విస్తురిస్తూ యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్న క్రిప్టో కరెన్సీ ప్రకటనలు ఉన్నాయని, దీని వల్ల ఉగ్రవాదులకు నిధులు సమకూరే ముప్పు ఉందని ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది(cryptocurrency news india). త్వరలోనే దీని కట్టడికి కేంద్రం చర్యలు తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి.

క్రిప్టోకరెన్సీకి(cryptocurrency news) సంబంధించి దేశంలో తలెత్తుతున్న సవాళ్లను అధిగమించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో శనివారం కీలక సమావేశం జరిగింది. ఆకర్షణీయ, మోసపూరిత ప్రకటనలతో ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేలా క్రిప్టోకరెన్సీ ప్రకటనలు ఉన్నాయని అధికారులు మోదీకి స్పష్టం చేశారు(cryptocurrency news india). దీనిపై తక్షణ నియంత్రణ అవసరమని చెప్పారు. క్రిప్టోకరెన్సీతో మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు వెళ్లే అవకాశం ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. ఇటువంటి నియంత్రణ లేని మార్కెట్లకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు(cryptocurrency news in india).

'ఇది శరవేగంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. చర్యలు తీసుకునే ముందు క్రిప్టోకరెన్సీపై ఓ కన్నేసి ఉంచనుంది(cryptocurrency india). ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలన్న అభిప్రాయాలూ ఉన్నాయి.' అని సమావేశంలో పాల్గొన్నవారు చెప్పారు. ఈ అంశంపై నిపుణులు, సంబంధిత వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరపడం కొనసాగించాలని, ఇందుకోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త వ్యూహాలు అవసరమని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ, సంబంధిత అంశాలపై జరిగిన సమావేశం సమగ్రమైనదని తెలుస్తోంది.

క్రిప్టోకరెన్సీపై ఇప్పటికే చేపట్టిన పలు చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని.. మున్ముందు తలెత్తే సవాళ్లపై నిపుణులు, ఇతరుల భాగస్వామ్యంతో త్వరితగతిన స్పందిస్తుందని ప్రభుత్వం హామీనిచ్చినట్లు సమాచారం(modi cryptocurrency). మొత్తం మీద 'క్రిప్టోకరెన్సీ ముప్పు' అనేది కేవలం ఏ ఒక్క దేశానికో చెందిన సమస్య కాదని.. ఇది ప్రపంచ దేశాలకు సవాలుగా నిలిచే అంశమని ఈ సమావేశం అభిప్రాయపడింది. అందువల్ల ప్రపంచ దేశాల భాగస్వామ్యం, ఉమ్మడి వ్యూహాలతో క్రిప్టోకరెన్సీ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్​బీఐ ఆందోళన..

దేశ ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టోకరెన్సీలు తీవ్ర ముప్పు కలిగిస్తాయని గతంలో ఆర్‌బీఐ అభిప్రాయపడింది(rbi on cryptocurrency). వాటిలో ట్రేడింగ్ చేసేవారితో పాటు.. మార్కెట్ విలువపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అలాగే.. దేశంలో క్రిప్టోకరెన్సీలను అనుమతించే అంశంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. 'రిజర్వ్ బ్యాంకు నియంత్రణ లేనందున అవి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు' అని వ్యాఖ్యానించారు.

క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తూ(cryptocurrency ban in india) మార్చి 2020లో ఆర్​బీఐ జారీచేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే పలు ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. అధికారిక డిజిటల్ కరెన్సీ ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని ఆర్​బీఐ వెల్లడించింది.

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే అది రెట్టింపు అవుతుందని టీవీ, వెబ్​సైట్లలో అనేక ప్రకటనలు వస్తున్నాయి. రూ.100తో కూడా ఇన్వెస్ట్​మెంట్​ ప్రారంభించవచ్చని యువతను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Nov 14, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details