ETV Bharat / business

మరో 'క్రిప్టో' మోసం.. కోట్ల రూపాయలతో సృష్టికర్తలు జంప్​!

author img

By

Published : Nov 2, 2021, 10:41 PM IST

Squid Game
స్క్విడ్ గేమ్​

క్రిప్టోకరెన్సీ పేరుతో (Squid Game Crypto) మరో భారీ మోసం వెలుగు చూసింది. స్క్విడ్ గేమ్​ పేరుతో అక్టోబర్​ 20న ప్రారంభమైన ఈ కాయిన్​ విలువు అమాంతం పెరిగిన తరువాత దాని సృష్టికర్తలు వారి హోల్డింగ్స్​ను అమ్మేసి.. పెట్టుబడిదారులకు భారీ నష్టాలను మిగిల్చారు.

క్రిప్టోకరెన్సీకి సంబంధించి మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కోట్ల కొద్ది మదుపరుల సంపద ఒక్కదెబ్బకు ఆవిరైంది. ప్రారంభమైన తొలినాళ్లలో ఉన్న విలువ కంటే అట్టడుగుకు చేరింది. అదే 'స్క్విడ్ గేమ్​' (Squid Game Crypto) కాయిన్​. అక్టోబర్​ 20న ఇది మొదలైంది. అంతర్జాతీయంగా ఉండే ఎన్నో మీడియా సంస్థలు ఈ కాయిన్​ భారీ లాభాలను ఆర్జించడాన్ని హెడ్​లైన్​లో ప్రచురించాయి. ఇంతటి ప్రాచూర్యం పొందిన ఈ కాయిన్​ మంగళవారం ఉదయం అనుకోని రీతిలో కుప్పకూలింది.

భారీగా పతనం..

స్క్విడ్ గేమ్ కాయిన్ అనే క్రిప్టోకరెన్సీ​ భారీగా పతనమైంది. ఇందుకు కారణం దీనిని వచ్చువల్​గా సృష్టించిన వ్యక్తులు.. దాని విలువ పతాక స్థాయికి చేరుకున్న తరువాత అందులో పెద్దమొత్తంలో ఉన్న వారి షేర్లను ఒక్కసారిగా అమ్మేయడమే. దీంతో దాని విలువ భారీగా పడిపోయింది. తొలినాళ్లలో అతి తక్కువకు కొనుగోలు చేసిన మదుపరులకు కూడా ఊహించని నష్టం వచ్చింది. సోమవారం ఉదయం 2,800 డాలర్లగా ఉన్న కాయిన్​ విలువ అమాంతం పడిపోయి 0.005 డాలర్లకు చేరింది. ఇందుకు వీరు ఎంచుకున్న పద్ధతి రగ్​ పుల్​.

ఏంటీ రగ్​ పుల్​..?

వచ్చువల్​గా ఉండే క్రిప్టో కరెన్సీని సృష్టించిన వాళ్లు తమ హోల్డింగ్‌లను వీలైనంత త్వరగా అమ్మేసి.. క్యాష్​ చేసుకోవాలని చూడడమే రగ్​పుల్​. ఈ ఉద్దేశంతో వీలైనంత త్వరగా దానిని గరిష్ఠాలకు చేర్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తారు. ఇందులో వారి షేర్లు తప్ప, పెట్టుబడి ఏం ఉండదు. కానీ పెట్టుబడిదారులు పెట్టిన డబ్బుతో కాయిన్​ విలువ భారీగా పెరిగిన తరువాత షేర్లు అమ్మేస్తారు.

ఇదీ చూడండి: ధన్​తేరాస్​ వేళ బంగారంపై భారీ ఆఫర్లు- జోరుగా విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.