తెలంగాణ

telangana

మరిన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. దేశంలో 38కి చేరిన కేసులు

By

Published : Dec 12, 2021, 2:14 PM IST

Updated : Dec 12, 2021, 6:51 PM IST

Omicron in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్​, మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో తొలి కేసు వెలుగులోకి రాగా.. కర్ణాటకలో మూడో కేసు బయటపడింది.

india omicron news
omicron cases in india

India Omicron cases: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్​లో తొలి కేసు నమోదు కాగా.. కర్ణాటకలో మూడో కేసు, మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది.

కేరళలో తొలి కేసు..

యూకే నుంచి కేరళ కోచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ సోకింది. ఈనెల 6న రాష్ట్రానికి వచ్చిన అతడికి పరీక్షలు చేయగా.. కొవిడ్ పాజిటివ్ అని ఈనెల 8న నిర్ధరణ అయింది. జీనోమ్ సీక్వెన్సింగ్​లో ఒమిక్రాన్​ వైరస్ సోకినట్లు తేలింది.

First Omicron case Chandigarh:

ఛండీగఢ్​లో 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త వేరియంట్ సోకిందని అక్కడి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నగరంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని స్పష్టం చేసింది.

బాధితుడు ఇటలీ నివాసి అని అధికారులు తెలిపారు. భారత్​లో ఉన్న బంధువులను చూసేందుకు ఇక్కడకు వచ్చాడని చెప్పారు. డిసెంబర్ 11న బాధితుడి జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. యువకుడు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని, ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారని వివరించారు.

Karnataka Omicron news:

మరోవైపు, కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మూడో కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిందని కర్ణాటక వైద్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేషన్​లో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

బాధితుడికి దగ్గరగా తిరిగిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఐదు ప్రాథమిక, 15 ద్వితీయ కాంటాక్టులను గుర్తించినట్లు మంత్రి సుధాకర్ వెల్లడించారు. వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

AP omicron cases:

ఆంధ్రప్రదేశ్​లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. సదరు వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా విశాఖ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధరణ అయింది.

విదేశాల నుంచి వచ్చిన 15 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్​కు పంపగా.. 10 మంది ఫలితాలు వచ్చాయి. అందులో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని ఏపీ వైద్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.

Omicron case in Nagpur:

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. పశ్చిమ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయినట్లు నాగ్​పుర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ రాధాక్రిష్ణన్​ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్​ కేసుల సంఖ్య 18కి చేరింది.

" ఎనిమిది రోజుల క్రితం నాగ్​పుర్​కు చెందిన వ్యక్తి పశ్చిమ ఆఫ్రికా దేశం నుంచి వచ్చారు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా కొవిడ్​-19 పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత సిటీ ఆసుపత్రిలో చేరారు. ఆయన నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించాం. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో ఆయనకు ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు స్పష్టమైంది. ఆయన్ను కలిసిన వారందరికీ నెగెటివ్​ వచ్చింది. "

- రాధాక్రిష్ణన్, మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​

ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు కమిషనర్​.

ఇదీ చదవండి:

Last Updated :Dec 12, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details