తెలంగాణ

telangana

ముంబయిలో కరోనా విలయం- తొలిరోజు 40 లక్షల మంది టీనేజర్లకు టీకా

By

Published : Jan 3, 2022, 9:28 PM IST

Updated : Jan 3, 2022, 10:46 PM IST

Omicron Cases in India: ముంబయిలో కొత్తగా 8వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 29 ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. గోవాలో కూడా కొత్తగా నాలుగు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. మరోవైపు, టీనేజర్ల టీకా పంపిణీ కార్యక్రమం తొలిరోజు జోరుగా సాగింది.

kerala covid cases
దిల్లీలో కరోనా కేసులు

Omicron Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి తీవ్రం అవుతోంది. ముంబయిలో కొత్తగా 8,082 కేసులు బయటపడ్డాయి. 622 మంది కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసులు 37,274గా ఉన్నాయి.

దిల్లీలో కొత్తగా 4099 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరుకుంది. ఒమిక్రాన్​ వేరియంటే కేసుల పెరుగుదలకు కారణమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్​ జైన్. గతేడాది మే 18 తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు, కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

కేరళలో కొత్తగా 29 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఇదివరకు.. ఒమిక్రాన్​ సోకిన 42 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 181కి చేరింది. మరోవైపు కొత్తగా 2560 మందికి కొవిడ్​ సోకగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 2150 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

గోవాలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఐదుకి చేరింది. మరోవైపు క్రూయిజ్​ షిప్​లో ముంబయి నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షులు నిర్వహించగా 66 మందికి పాజిటివ్​ అని తేలింది. మొత్తం 2000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు సిబ్బంది.

మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఝార్ఖండ్​ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈనెల 15 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కార్యాలయాలు కూడా 50 శాతం సిబ్బందితోనే పనిచేయాలని స్పష్టం చేసింది.

ఆంక్షల సడలింపు

బంగాల్​లో విధించిన కొవిడ్​ ఆంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. లోకల్​ ట్రెయిన్ సర్వీసుల అందుబాటును రాత్రి 7 గంటల నుంచి 10 గంటలకు పొడగిస్తున్నట్లు వెల్లడించింది.

పిల్లలకు టీకా పంపిణీ

15 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం సోమవారం ప్రారంభించిన కరోనా టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు ఉత్సాహంగా సాగింది. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు 40 లక్షలకు పైగా లబ్ధిదారులకు టీకా అందజేశారు.

టీకా పంపిణీ కేంద్రాలను ఎక్కువగా పాఠశాలలు, విద్యాసంస్ధల్లో ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే బెలూన్లు, అందమైన చిత్రాలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల టీకా కోసం వచ్చిన పిల్లలకు పువ్వులు, పెన్నులు కానుకగా అందించారు.

దిల్లీ రాం మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సందర్శించి లబ్ధిదారులతో ముచ్చటించారు. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందజేస్తున్నారు. ఈ వయసు వారు దేశంలో 7 కోట్ల 40 లక్షల మంది ఉంటారని అంచనా.

  • 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీతో మహమ్మారి నుంచి యువతకు రక్షణ కల్పించడంలో ముందడుగు పడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరింత మంది వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి :'81% కేసులు ఒమిక్రాన్​వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!

Last Updated : Jan 3, 2022, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details