తెలంగాణ

telangana

Muslim Build Temple : అమ్మవారి గుడి నిర్మించిన దివ్యాంగ ముస్లిం.. రోజూ ప్రత్యేక పూజలు

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 2:28 PM IST

Muslim Build Temple : ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి.. హిందూ దేవాలయాన్ని నిర్మించాడు. రోజూ దేవాలయానికి వెళ్లి మంత్రాలు చదువుతూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడంటే?

Muslim Build Temple
Muslim Build Temple

అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన ముస్లిం.. రోజూ ప్రత్యేక పూజలు.. దివ్యాంగుడైనా..

Muslim Build Temple :హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా దేశమంతటా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. చాలాచోట్ల హిందూ పండుగలను ముస్లింలు జరుపుకోవడం.. ముస్లిం పండుగలను హిందువులు ఆదరించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మరో ఆసక్తికరమైన ఘటన కర్ణాటకలోని కొప్పల్​ జిల్లాలో జరిగింది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి.. ఒకే ప్రాంగణంలో ఆలయంతోపాటు దర్గాను నిర్మించాడు.

కలలో అమ్మవారే చెప్పిందట!
జిల్లాలోని గంగావతి తాలుకా బసపట్టణ గ్రామానికి చెందిన అబూ సాహెబ్​.. పుట్టుకతోనే శారీరక వైక్యలం బారినపడ్డాడు. జీవనోపాధి కోసం హిత్నలా గ్రామంలో పంక్చర్​ షాప్​ను నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అంబా దేవి కలలోకి వచ్చిందట. తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరిందట. దీంతో అతడు ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని స్థానికులతో తెలిపాడు.

పూజలు చేస్తున్న అబూ సాహెబ్​

Muslim Man Built Hindu Temple : స్థానికులు, భక్తుల సహాయంతో అబూ సాహెబ్.. ఐదు నెలల క్రితం ఒకే ప్రాంగణంలో ఆలయంతోపాటు దర్గాను నిర్మించాడు. అంతే కాకుండా అప్పటి నుంచి ప్రతి రోజు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. అబూసాహెబ్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. హిందు సంప్రదాయాల ప్రకారం పూజలను చేయడం వల్ల భక్తులు అతడిని ప్రశంసిస్తున్నారు. అబూ మంత్రాలు చదివిన తీరు.. ప్రత్యేకంగా ఉంటుందని మహిళా భక్తులు చెబుతున్నారు.

పక్కపక్కనే దర్గా, అంబా దేవి ఆలయం
మహిళా భక్తులతో అబు

శివ భక్తులు భజన చేసేందుకు మండపం నిర్మించిన ముస్లిం మహిళ
కొన్నినెలల క్రితం.. ఆధ్యాత్మిక నగరమైన కాశీలో ఓ ముస్లిం మహిళ శివాలయాన్ని నిర్మించారు. వారణాసిలోని గణేశ్​​పూర్​ రుద్రబిహార్​ కాలనీకి చెందిన నూర్​ ఫాతిమా వృత్తిపరంగా అడ్వకేట్​. ముస్లిం అయినప్పటికీ ఆమె శివభక్తురాలు. 2004లో ఆమె తను ఉండే కాలనీలో శివాలయాన్ని కట్టించారు. స్థానికులు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ గుడి చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. ఇది చూసిన నూర్​ వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దీంతో ఆలయం ముందు ఓ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు అందరూ అక్కడ కూర్చుని భజనలు చేస్తున్నారు.

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

వెల్లివిరిసిన మతసామరస్యం.. హనుమాన్ మాలలో ముస్లిం వ్యక్తి.. భక్తిశ్రద్ధలతో భజనలు

ABOUT THE AUTHOR

...view details