తెలంగాణ

telangana

'వాళ్లు పేపర్​పైనే సమాజ్​వాదీలు- రైతులకు చేసిందేమీ లేదు'

By

Published : Feb 4, 2022, 6:18 PM IST

Modi UP Rally: ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్చువల్​ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వాలు రైతుల కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కరోనా వ్యాక్సిన్​పైన కూడా విపక్షాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని విమర్శించారు.

Double engine govt for double pace Vikas
Double engine govt for double pace Vikas

Modi UP Rally: కరోనా వ్యాక్సిన్లపై విపక్ష పార్టీలు వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తొలిదఫాలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్‌లో 23 నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్‌గా అభివర్ణించి ప్రజలు దానిని తీసుకోవద్దని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు విశ్వసించకుండా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్‌ను తీసుకున్నారని ప్రశంసించారు.

యూపీలో యోగి సర్కార్‌.. గూండాలు, మాఫియాను తరిమికొట్టిందని అన్నారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే ఎవరిని గెలిపించాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ప్రధాని సూచించారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వల్ల కొవిడ్‌ టీకా పంపిణీలో ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని తెలిపారు.

''కరోనా వ్యాక్సిన్‌లపై వదంతులు వ్యాప్తి చేసి కొన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తిన వారికి తగిన జవాబు దక్కింది. ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుండా వారు కొన్నిసార్లు భయపెట్టేవారు. వ్యాక్సిన్‌లపై దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరో దేశ ప్రజలు కాస్త ఆలోచించాలి. దేశ ప్రజలకు నా మాటలపై విశ్వాసం ఉండేది. నా మాటలను నమ్మి ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇంత భారీ స్ధాయిలో టీకాల పంపిణీ జరుగుతుందని నమ్మి ఉండరు.''

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సమాజ్​వాదీ పార్టీ నేతల గురించి మాట్లాడిన మోదీ.. వారు పేపర్​పైనే సమాజ్​వాదీలు అని.. రైతుల పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దలేకపోయిందని అన్నారు.

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటిదశ పోలింగ్​ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Asaduddin Owaisi news: యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో గురువారం.. హైదరాబాద్​ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు జడ్​ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా దానిని ఒవైసీ తిరస్కరించారు. తన ప్రాణాలు పోయినా సరే.. దేశంలో మతసామరస్యాన్ని పెంపొందించాలని లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాను కోరారు.

ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలే బ్యాలెట్​ ద్వారా.. దీనికి తగిన సమాధానం చెప్తారని అన్నారు.

ఈ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. ఫిబ్రవరి 7న పార్లమెంటులో సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.

ఇవీ చూడండి:పశ్చిమ యూపీలో వ్యతిరేక పవనాలు- భాజపా గట్టెక్కేనా?

లంగ్స్​లో ఇరుక్కుపోయిన లవంగం- ఏడేళ్ల తర్వాత బయటకు!

ABOUT THE AUTHOR

...view details