తెలంగాణ

telangana

హైవే మధ్యలో రాయి.. పూజిస్తే చాలు.. మోకాళ్లు, కీళ్ల నొప్పులు మాయం!

By

Published : Oct 8, 2022, 4:04 PM IST

మోకాళ్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటాం. అయితే హైవే మీద ఉన్న రాయిని పూజిస్తే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పలు తగ్గుతాయంటున్నారు అక్కడి ప్రజలు. ఆ ప్రదేశం ఎక్కడుందో? అసలు ఎందుకిలా చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం.

Medicine for knee and joint pain
హైవేపై ఉన్న రాయికి పూజలు చేస్తున్న భక్తులు

మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్తాం. అక్కడ వైద్యులు ఇచ్చిన మందులను వాడుతాం. అలాగే కొందరు ఆయుర్వేద మందులను ఉపయోగిస్తారు. కానీ కర్ణాటక చామరాజనగర్ ప్రజలు మాత్రం​ జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళుతున్నారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయంటున్నారు. ఆ కథెంటో ఓ సారి తెలుసుకుందాం.

హైవేపై ఉన్న రాయికి పూజలు చేస్తున్న భక్తులు
పూజలు చేస్తున్న మహిళలు

ఇదీ కథ..
యలందూర్​ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ రాయి చాలా ఏళ్లుగా ఉంది. మోకాళ్ల, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని నమ్ముతున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, కూలీలు సైతం ఇక్కడకు దిగి మొక్కుతున్నారు. అక్కడ నారికల్లు మారమ్మ అనే దేవత ఉందని స్థానికులు చెబుుతున్నారు.

.

మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. ఇక్కడకు వచ్చి పూజలు చేయడం వల్లే తమ ఆరోగ్య సమస్యలు కుదుటపడ్డాయని అంటున్నారు. ఈ రహదారి ఎంత రద్దీగా ఉన్నా భక్తులు మాత్రం ఇక్కడ పూజలు చేయకుండా వెళ్లట్లేదు.

ఇవీ చదవండి:టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. హామీ నిలబెట్టుకున్న సీఎం.. విద్యార్థులు ఖుష్

'వాయుసేనలో కొత్త విభాగం.. వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులు'

ABOUT THE AUTHOR

...view details