తెలంగాణ

telangana

టీవీలో అది చూసి ఉరేసుకున్న బాలుడు.. ఆ ఊళ్లో తీవ్ర విషాదం

By

Published : Jun 15, 2022, 2:05 PM IST

Boy Hangs Watching Suicide Scene: టీవీలో ఓ ఆత్మహత్య సన్నివేశాన్ని చూసిన బాలుడు.. ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ మండ్లా జిల్లా బీజాడాండీ ప్రాంతంలో జరిగింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Boy Hangs After Watching Suicide Scene
Boy Hangs After Watching Suicide Scene

Boy Hangs Watching Suicide scene: మధ్యప్రదేశ్​ మండ్లాలో విషాదకర ఘటన జరిగింది. టీవీలో వచ్చిన ఆత్మహత్య దృశ్యాన్ని చూసి.. 12 ఏళ్ల బాలుడు ఉరివేసుకున్నాడు. ఇంట్లో వేలాడుతూ కనిపించిన చిన్నారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటన గిరిజనులు ఎక్కువగా ఉండే బీజాడాండీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది:రోజూలానే చిన్నారి తల్లిదండ్రులు మంగళవారం కూలీ పనులకు వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు.. టీవీలో ఆత్మహత్య సన్నివేశాలను చూశాడు. దానిని అనుకరించాలని నిర్ణయించుకున్నాడు. మెడకు వస్త్రం చుట్టుకొని.. అలాగే చేయాలని ప్రయత్నించగా ఉరిపడి చనిపోయాడు. సుమారు గంట తర్వాత గమనించిన స్థానికులు బాలుడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. చిన్నారి మృతితో ఊళ్లో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details