తెలంగాణ

telangana

Pub G గేమ్​లో పరిచయం.. ఆల్కహాల్​ తాగించి రేప్.. ఆపై న్యూడ్​ వీడియోలతో బ్లాక్ మెయిల్

By

Published : Aug 3, 2023, 2:22 PM IST

Updated : Aug 3, 2023, 2:31 PM IST

Man Rapes Woman by Threatening with Nude Videos : సోషల్​ మీడియాలో ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారి దేశాలు, ఖండాలు దాటిన వార్తలు కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. కానీ ఈ వార్తలో మాత్రం ఆన్​లైన్​ గేమ్​ వేదికగా మహిళకు పరిచయమైన ఓ యువకుడు.. వేధించి.. వెంబడించి.. చివరికి కూల్​ డ్రింక్​లో ఆల్కహాల్​ కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందంతా వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్​ మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man Rapes Woman by Threatening with Nude Videos
Man Rapes Woman by Threatening with Nude Videos

Man rapes woman multiple times by blackmailing her Hyderabad : మొబైల్​ గేమింగ్​ యాప్​ పరిచయాలు ఎంత సంతోషాలను ఇస్తాయో తెలియదు గానీ.. ఎంత మంది జీవితాలను ఆగం చేస్తున్నాయో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. పబ్జీ గేమ్​సో ఓ వివాహితతో పరిచయం పెంచుకున్న యువకుడు.. ఆమెతో సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టాడు. ఇది తెలిసిన భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఇదే అవకాశంగా భావించిన యువకుడు ఆమెకు.. దగ్గరై కూల్​ డ్రింక్​లో ఆల్కహాల్​ కలిపి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనంతటిని వీడియో తీసి తర్వాత ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా గండేపల్లికి చెందిన ఓ యువతి సమీప గ్రామస్థుడైన వస కుమార్ నరసింహమూర్తి అనే యువకుడితో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(గతంలో పబ్జీ) ద్వారా పరిచయం ఏర్పడింది. 2020 జూన్​లో అదే గ్రామానికి చెందిన వాలంటీర్​తో బాధితురాలికి వివాహం జరిగింది. ఆమెకు వివాహం జరిగిన తరువాత కూడా పబ్ జీలో పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నానని వేధించేవాడు. తరచూ సందేశాలు, ఫోన్​లు చేస్తుండటంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యారు. క్రమంగా ఆ గొడవలు ముదిరి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.

Man rapes woman in Hyderabad :భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్​లోని తన స్నేహితురాలు దగ్గరికి వచ్చింది. ఇదే క్రమంలో నరసింహ మూర్తి కూడా హైదరాబాద్ వచ్చాడు. నగరానికి వచ్చిన తర్వాత మూర్తి.. మహిళను పలుమార్లు కలిశాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తను చూసి భయపడిన యువతి.. రూమ్​లో ఉంటే సేఫ్ కాదని అమీర్​పేటలోని ఓ హాస్టల్​లోకి మారింది. గమనించిన యువకుడు ఆమె ఉంటున్న సమీపంలోని మరో హాస్టల్​లో ఉండేవాడు. చివరికి ఆమెతో మాట్లాడి భర్తను వదిలేస్తే తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

Man Blackmails Woman with Nude Videos Hyderabad : ఆ తరువాత జవహర్​ నగర్​లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. యువకుడి మాయమాటలను నమ్మిన యువతి.. యవకుడి గదికి వెళ్లింది. ఇదే అదునుగా ఆమెకు కూల్​ డ్రింక్​లో ఆల్కహాల్​ కలిపి ఇచ్చాడు. అనంతరం పలు మార్లు అత్యాచారం చేశాడు. యువతి న్యూడ్​ వీడియోలు, ఫొటోలు తీశాడు.ఆ తరువాత వాటితో బాధితురాలిని బెదిరించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు.

చివరికి యువతి ఏం చేయాలో తెలియక స్వగ్రామం వెళ్లి.. సమీప బస్​ స్టేషన్​ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు కోసం హైదరాబాద్ మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. ప్రస్తుతం మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 3, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details