తెలంగాణ

telangana

DCP on Shamshabad Woman Murder : 'కారుకు కప్పే కవర్‌తో చంపేందుకు యత్నం.. తిరగబడటంతో రాయితో మోది హత్య'

By

Published : Jun 9, 2023, 12:10 PM IST

Updated : Jun 9, 2023, 7:21 PM IST

Priest Killed a Woman at Shamshabad
Priest Killed a Woman at Shamshabad

12:04 June 09

శంషాబాద్ పరిధిలో మహిళను హత్య చేసిన పూజారి

Shamshabad Priest Killed a Woman :రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం ఓ మ్యాన్ హోల్​లో పడేశాడు. ఆ తర్వాత ఏం ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. మూడ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్​సరూర్‌నగర్‌ ప్రాంతంలో అప్సర అనే యువతి తన తల్లితో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో వెంకట సాయికృష్ణ పూజారిగా పని చేస్తున్నాడు. అప్సర ఆలయానికి వస్తూ ఉండేది. ఈ క్రమంలో సాయి కృష్ణ అప్సరతో మాట కలిపాడు. క్రమంగా వారిద్దరికి పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తుండటంతో సాయి కృష్ణ తరచూ అప్సర ఇంటికి రాకపోకలు సాగించేవాడు. ఇద్దరూ కలిసిమెలిసి తిరిగే వారు. అయితే అప్పటికే సాయి కృష్ణకు వివాహం జరిగి.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలియని అప్సర.. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది.

ఈ నెల 3న అప్సర.. తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తున్నాని, తనను శంషాబాద్‌ వద్ద వదిలిపెట్టాలని సాయి కృష్ణను కోరింది. దీంతో అతను కారులో ఆమెను శంషాబాద్‌ సుల్తాన్‌పల్లి వద్ద వదిలి పెట్టడానికి వెంట తీసుకుని వెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య మరోసారి మాటామాటా పెరిగింది. వివాహం చేసుకోవాలంటూ అప్సర అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో సాయికృష్ణ బండరాయితో ఆమె తలపై మోదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

Priest Killed a Woman at Shamshabad : అనంతరం సాయికృష్ణ అప్సర మృతదేహాన్ని తన కారులో తీసుకువచ్చి.. 4వ తేదీ సరూర్‌నగర్‌ మండల కార్యాలయం వద్ద ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ చేరుకుని అప్సర కనిపించడం లేదని, స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానంటే శంషాబాద్‌ వద్ద వదిలిపెట్టానని తిరిగి రాలేదని పోలీసులకు తెలిపాడు. ఆమెకు ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత యధావిధిగా ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు.. సాయి కృష్ణ ఫోన్​తో పాటు అప్సర ఫోన్​లను విశ్లేషించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం పూజారి సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా.. అప్సరను హత్య చేసి మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని మండల కార్యాలయం సమీపంలో సెప్టిక్‌ ట్యాంకులో పడేసినట్టు వెల్లడించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి సెప్టిక్‌ ట్యాంకును జేసీబీ సహాయంతో తవ్వి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

"అప్సర కనిపించటం లేదని సాయికృష్ణ ఆమె తల్లితో కలిసి వచ్చి శంషాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అప్సరను ఈ నెల 3న భద్రాచలం బస్సు ఎక్కించామని చెప్పాడు. మరుసటి రోజు నుంచి అప్సర ఫోన్ స్విచ్ఛాఫ్​ వస్తోందని చెప్పాడు. అప్సర తల్లి, సాయికృష్ణ మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. సాయికృష్ణ, అప్సర కారులో నర్కుడ వైపు వెళ్లినట్లు గుర్తించాం. కారు ముందు సీట్లో అప్సర నిద్రించినప్పుడు చంపి ఉండవచ్చు. కారుకు కప్పే కవర్‌తో ఊపిరాడకుండా చేసి చంపేందుకు యత్నించాడు. అప్సర తిరగబడటంతో రాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని కారుకు కప్పే కవర్‌లో చుట్టాడు. అనుమానం వచ్చి వెంకటకృష్ణ ఇంటికి వెళ్లి పరిశీలించగా కారు వెనక డిక్కీ దగ్గర ఈగలు కనిపించాయి. సరూర్​నగర్​ వద్ద సెప్టిక్ ట్యాంక్​ సమీపంలో సాయి కృష్ణ మట్టి పోయించి అనుమానం రాకుండా వ్యవహరించాలని ప్రయత్నం చేశాడు. అప్సర సీరియల్​లో నటించాలని చెన్నై నుంచి హైదరాబాద్​కు వచ్చింది. తన సోదరి వద్ద నివసిస్తోంది. ఈ క్రమంలో బంగారు మైసమ్మ ఆలయానికి వస్తుండగా పూజారి సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. సాంకేతిక వివరాలు, సీసీ కెమెరా దృశ్యాలు, సెల్​ఫోన్​ల విశ్లేషణ ద్వారా హత్య కేసును ఛేదించాం. అప్సరను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే అంతమొందించినట్టు దర్యాప్తులో తేలింది. అప్సర గతంలో గర్భం దాల్చింది. ఆమెకు అబార్షన్ కూడా అయిందని దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం." - నారాయణరెడ్డి, శంషాబాద్​ డీసీపీ

గతంలో అబార్షన్..: అప్సర.. గతంలో ఒకసారి గర్భం దాల్చిందని.. ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు అబార్షన్‌ కూడా అయినట్టు పోలీసుల విచారణలో నిందితుడు సాయి కృష్ణ వెల్లడించినట్టు సమాచారం. అయితే గర్భంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు చెబుతున్నాడని.. దీనిపైనా లోతుగా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సాయి కృష్ణను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని చెబుతున్నారు.

ఇవీ చూడండి..

ప్రియుడితో కలిసి తల్లి హత్య.. ప్రేమ వద్దు అన్నందుకు మైనర్ కూతురు దారుణం

Hyderabad Girl Suspicious death case in Bangalore : బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి.. ప్రియుడే నిందితుడా..!

కుక్కలకు ఆహారంగా శరీర భాగాలు! ఠాణె హత్య కేసులో ట్విస్ట్.. 'ఆమెది ఆత్మహత్యే!'

Last Updated : Jun 9, 2023, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details