యువ జంట కిరాతకం.. హోటల్ రూమ్​లో వృద్ధుడి హత్య.. శరీరాన్ని ముక్కలు చేసి సూట్​కేస్​లో..

author img

By

Published : May 26, 2023, 1:37 PM IST

hotel owner murder in kozhikode kerala

శ్రద్ధా వాకర్ హత్య​ తరహాలో కేరళలో దారుణ ఘటన జరిగింది. 58 ఏళ్ల ఓ హోటల్​ యజమానిని 22 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల తన స్నేహితురాలు కలిసి అత్యంత కిరాతకంగా చంపారు. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్​లో తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో విసిరేశారు.

కేరళ కోజికోడ్​ జిల్లాలో సిద్ధిఖ్​ అనే 58 ఏళ్ల ఓ హోటల్ వ్యాపారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు స్నేహితులు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్​లో తీసుకెళ్లి పాలక్కడ్​ జిల్లా అట్టప్పాడి పాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 22 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ఇద్దరిని శుక్రవారం ఉదయం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. ముక్కలుగా పడి ఉన్న మృతదేహం శరీర భాగాలను అట్టపాడి పాస్​ వద్ద స్వాధీనం చేసుకొని పోస్ట్​మార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు పోలీసులు. హత్య జరిగిన సమయంలో హోటల్ గదిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పాలక్కడ్‌కు చెందిన మరో వ్యక్తి ఆషిక్​ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మలప్పురం జిల్లా తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్​ (58) కోజికోడ్​లోని ఒలవన్నాలో ఓ హోటల్​ను నిర్వహిస్తున్నారు. వ్యాపారం కోసం ఈయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఇక్కడే వసతిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న కోజికోడ్​లోని ఎరంజిపాలెంలోని ఓ హోటల్​లో G3, G4 రెండు గదులను బుక్​ చేసుకున్నారు. సిద్దిఖ్​ ఉన్న హోటల్​లోనే పాలక్కడ్​కు చెందిన నిందితులు శిబిల్ ​(22), అతడి స్నేహితురాలు ఫర్హానా (18) కూడా హోటల్​లోని ​పైఅంతస్తులో రూం తీసుకున్నారు. వీరిద్దరితో పాటు సిద్ధిఖ్​ కుడా హోటల్​లోకి ప్రవేశిస్తున్నట్లుగా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్​ అయ్యాయి. కాగా, మే 19న మధ్యాహ్నం శిబిల్​, ఫర్హానా ఓ ట్రాలీ బ్యాగ్​తో కిందకు దిగారు. ఈ దృశ్యాలు కూడా హోటల్​లోని కెమెరాల్లో రికార్డ్​ అయ్యాయి. ఈ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

hotel owner murder in kozhikode kerala
మృతుడు సిద్ధిఖ్​

ఇదిలా ఉంటే సిద్ధిఖ్​కు అతడి కుమారుడు ఎన్ని సార్లు ఫోన్​ చేసినా​ స్విచ్ ఆఫ్​ వచ్చింది. అదే సమయంలో అతడి ఫోన్‌కు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా మెసేజ్‌లు వచ్చాయి. ఫోన్​ స్విచ్​ ఆఫ్​, పెద్ద మొత్తంలో నగదు విత్​డ్రా వంటి వాటితో ఆందోళన చెందిన సిద్ధిఖ్​ కుమారుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శిబిల్​ సిద్ధిఖ్​​ నిర్వహిస్తున్న హోటల్​లో 15 రోజులు పనిచేశాడు. ఈ క్రమంలో అతడి ప్రవర్తన నచ్చకపోవడం వల్ల అతడిని పనిలో నుంచి తొలగించాడు సిద్ధిఖ్​​. దీంతో వ్యాపారి సిద్ధిఖ్​​పై కోపం పెంచుకున్న శిబిల్​ ఉద్యోగం నుంచి తొలగించాడనే కారణంతోనే సిద్దిఖ్​పై వ్యక్తిగతంగా పగ పెంచుకొని అతడిని హత్యా చేశాడా.. లేదా వేరే ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులు సిద్ధిఖ్​ను ఆరు రోజుల ముందే హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

రెండు గదులు ఎందుకు బుక్​ చేశారు..?
సిద్ధిఖ్​ ఎరంజిపాలెంలో ఎందుకు గది తీసుకున్నారు? అది కూడా రెండు గదులు ఎందుకు బుక్ చేశారు? ఘటన వెనుక హనీ ట్రాప్​ ఏమైనా ఉందా..? కుమారుడి ఫోన్​కు లక్షల రూపాయలు విత్​డ్రా చేసుకున్నట్లుగా వచ్చిన సందేశాలు సిద్ధిఖ్​ విత్ డ్రా చేస్తేనే వచ్చాయా లేదా ఇంకెవరైనా ఆ డబ్బును వాడుకున్నారా అనే విషయాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

తానే కొట్టింది.. ఆపై ఆస్పత్రిలో చేర్చింది!
ఓ మహిళ తన భర్తను కర్రతో అత్యంత దారుణంగా కొట్టింది. అనంతరం ఆమెనే స్వయంగా అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించింది. ఈ ఘటనలో భర్త కాలు విరిగిపోయింది. ఉత్తర్​ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలోని పదరియా గ్రామంలో జరిగిందీ ఘటన. పెయింటర్‌గా పనిచేస్తున్న సంజయ్ కుమార్​ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా నిత్యం మద్యం సేవించడమే కాకుండా డ్రగ్స్​కు బానిసై తరచూ ఇంట్లో గొడవలకు దిగుతున్నాడనే కారణంతో చంద్రావతి అనే మహిళ మనస్తాపానికి గురైంది. గురువారం అతడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలంటూ ఇంట్లో ఉన్న కర్రతో కొట్టింది.

wife attack on husband in uttar pradesh
భర్తను కొట్టి ఆస్పత్రిలో చేర్చిన భార్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.