ETV Bharat / bharat

'భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే'

భార్యాభర్తల దాంపత్య జీవితంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని న్యాయస్థానం తెలిపింది.

author img

By

Published : May 26, 2023, 9:31 AM IST

Allahabad High Court on Physical relationship

తగిన కారణంగా లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల పిటిషన్​ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ రవీంద్ర యాదవ్​ అనే వ్యక్తి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేసింది.

రవీంద్ర యాదవ్​.. తనకు 1979లో వివాహమైందని.. పెళ్లయిన కొంత కాలం తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని అప్పీలులో పేర్కొన్నారు. అలాగే తన భార్య తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందని తెలిపారు. ఒకే ఇంట్లో ఉంటున్నా తనతో లైంగిక సంబంధానికి దూరంగా ఉందని ఆయన అప్పీల్​లో పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత తన భార్య.. పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. తన భార్యను ఇంటికి రమ్మని పిలిచినా ఆమె రాలేదని అన్నారు. ఆ తర్వాత 1994లో గ్రామ పంచాయతీలో రూ.22 వేలు భరణం చెల్లించి పరస్పరం విడిపోయామని వెల్లడించారు. అనంతరం అప్పీలుదారుడి భార్య మరో వివాహం చేసుకుంది.

ఈ నేపథ్యంలో లీగల్​గా విడాకులు పొందేందుకు సిద్ధమయ్యాడు రవీంద్ర యాదవ్. మానసిక క్రూరత్వం, తనను విడిచిపెట్టి ఉండటాన్ని కారణాలుగా చూపుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే క్రూరత్వం కారణంగా విడాకులు ఇచ్చేందుకు వారణాసి ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. ఆయన విడాకుల అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో అలహాబాద్ హైకోర్టులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేశారు రవీంద్ర యాదవ్.

ఈ అప్పీల్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు చాలా కాలం పాటు విడివిడిగా జీవిస్తున్నారని పేర్కొంది. 'భార్యకు దాంపత్య బంధం మీద గౌరవం లేదు. ఆమె తన భర్తకు భార్యగా ఉండేందుకు సుముఖంగా లేదు. అందుకే వారి దాంపత్య జీవితం విచ్ఛిన్నమైంది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

విడాకులపై సుప్రీం సంచలన తీర్పు..
భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సర్వోన్నత న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేయొచ్చని వ్యాఖ్యానించింది. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేధాలు, సమస్యలు పరిష్కారం కానీ స్థితి తలెత్తినప్పుడు.. ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.