తెలంగాణ

telangana

'మహా' విలయం: ఒక్కరోజే 63వేల కరోనా కేసులు

By

Published : Apr 16, 2021, 9:31 PM IST

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 63,729 మంది కరోనా బారిన పడ్డారు. 398 మంది కరోనాతో మరణించారు. అటు ఉత్తర్​ప్రదేశ్​లోనూ రికార్డు స్థాయిలో 27, 426 కేసులు నమోదు కాగా, దిల్లీలో 19,486 మంది కరోనా బారిన పడ్డారు.

latest covid-19 cases in states
మహారాష్ట్రలో కరోనా విజృంభణ

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 63,729 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37లక్షల 3వేల 584కు చేరింది. కొత్తగా 398 మంది కరోనా బారిన పడి మరణించారు. వైరస్ నుంచి కోలుకుని 45,335 మంది ఇళ్లకు వెళ్లారు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • ఉత్తర్​ ప్రదేశ్​లో శుక్రవారం కొత్తగా 27, 426 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. 103 మంది మరణించారు.
  • దిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 19,486 మంది వైరస్ బారిన పడ్డారు. 141మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 14, 859 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి మరో 78 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో రికార్డు స్థాయిలో 11,045కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ కారణంగా మరో 60మంది బలయ్యారు.
  • కేరళలో కొత్తగా 10,031 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 21 మంది మరణించారు.
  • గుజరాత్​లో కొత్తగా 8,920 మందికి కరోనా సోకింది. 94 మంది మరణించారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 7,359 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్​ బారిన పడి మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పంజాబ్​లో శుక్రవారం 3,915 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 51 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details