తెలంగాణ

telangana

వరుణుడి బీభత్సానికి 10 మంది బలి

By

Published : Sep 28, 2021, 8:05 PM IST

Updated : Sep 28, 2021, 11:00 PM IST

భారీ వర్షాలు మహారాష్ట్రను(Maharashtra Rain News) ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా 48 గంటల వ్యవధిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసయ్యాయి. ఎన్నో పశువులు మరణించాయి. మరోవైపు.. రానున్న రెండు రోజుల్లో కూడా ఆ రాష్ట్రంలో(Maharashtra Rain News) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.

Maharashtra Rain News
మహారాష్ట్రలో వర్షాలు

మహారాష్ట్రలో వరదలు

మహారాష్ట్రను భారీ వర్షాలు(Maharashtra Rain News) అతలాకుతలం చేస్తున్నాయి. నదులు ఉప్పొంగుతుండగా పలు జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. వరదలు, వర్షాల కారణంగా మరాఠ్​​వాడా ప్రాంతంలో 48 గంటల వ్యవధిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 200కు పైగా పశువులు ప్రాణాలు విడిచాయి. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో పరిస్థితి(Maharashtra Rain News) విధ్వంసకరంగా మారిందని అక్కడి అధికారులు చెప్పారు.

ఔరంగాబాద్​లో కాలనీలకు చేరిన వరద నీరు
ఔరంగాబాద్​లో వరద బీభత్సం

యావత్​మాల్​ జిల్లాలో వరద ఉద్ధృతికి బస్సు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. నీట మునిగిన ఓ వంతెనపై నుంచి బస్సు దాటుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న మరో ముగ్గురు గల్లంతయ్యారు.

మంజరా డ్యామ్​లోకి భారీగా వరద నీరు చేరుతుండగా.. అధికారులు డ్యామ్​ 18 గేట్లను మంగళవారం తెరిచారు. దీంతో బీడ్​​ జిల్లాలోని పలు గ్రామాలను వరదలు చుట్టుముట్టాయి. సమీపంలోని ఇతర జిల్లాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. నాశిక్​ జిల్లాలో గోదారి నది ఉప్పొంగుతున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది.

నాశిక్​లో వరద ఉద్ధృతి
నాశిక్​లో వరదలు
నాశిక్​లో ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు
నేల కూలిన చెట్లు
ఔరంగాబాద్​లో కాలనీలకు చేరిన వరద నీరు

రికార్డు స్థాయిలో వర్షపాతం..

మధ్య మహారాష్ట్ర(Maharashtra Rain News) పరిధిలోని 8 జిల్లాల్లో అత్యధిక వర్షం కురిసింది. ఈ 8 జిల్లాల్లోని 180 ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 65 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు డివిజనల్​ కమిషనర్ కార్యాలయం తెలిపింది. సోమవారం నుంచి తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్​ తెలిపారు. నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఎల్లో అలర్ట్​..

మరోవైపు రానున్న రెండు రోజుల్లో కూడా మహారాష్ట్రలో భారీ వర్షాలు(Maharashtra Rain News) కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావారణ శాఖ హెచ్చరించింది. ముంబయిలో బధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పింది. 'ఎల్లో అలర్ట్​'ను జారీ చేసింది.

సహాయక చర్యల్లో ఎన్​డీఆర్​ఎఫ్​

లాతౌర్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​ చర్యలు చేపట్టింది. ఓ హెలికాప్టర్​ సహా బోట్లను అధికారులు మోహరించారు. సర్సా గ్రామంలో మంజారా నది ఒడ్డున చిక్కుకున్న 40 మందిలో 25 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:Gulab cyclone: మరింత బలహీనపడి వాయుగుండంగా 'గులాబ్​'!

Last Updated : Sep 28, 2021, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details