తెలంగాణ

telangana

'నన్ను కరెంట్ దొంగ అనొద్దు- రూ.68వేలు ఫైన్​ కట్టేశా!'

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 4:45 PM IST

Kumaraswamy Electricity Theft Case : ఇంటికి దగ్గర్లో ఉన్న విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్​ వినియోగించారనే కారణంతో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి భారీ జరిమానా​ విధించారు విద్యుత్​ శాఖ అధికారులు. ఆ జరిమానా మొత్తాన్ని ఆయన శుక్రవారం చెల్లించారు​.

Kumaraswamy Electricity Theft Case
Kumaraswamy Electricity Theft Case

Kumaraswamy Electricity Theft Case : ఎటువంటి అనుమతి లేకుండా ఇంటికి దగ్గర్లోని ఓ విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్​ వినియోగించారనే కారణంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ అగ్రనేత హెచ్​డీ కుమారస్వామికి రూ.68,526 జరిమానా విధించారు విద్యుత్​ శాఖ అధికారులు. ఈ మేరకు ఆ మొత్తాన్ని ఆయన శుక్రవారం స్థానిక విద్యుత్​ కార్యలయంలో చెల్లించారు.

'నన్ను కరెంటు దొంగ అనడం మానండి'
ఒక ఈవెంట్​ మేనేజర్​ చేసిన పనికి తాను చింతిస్తున్నానని కుమారస్వామి అన్నారు. విద్యుత్​ శాఖ విధించిన జరిమానా చెల్లించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ పదే పదే తనను కరెంట్​ దొంగ అని బయట ప్రస్తావించడం, మీడియాకు ప్రకటనలు ఇవ్వడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. పైగా అధికారులు కూడా దీనిపై బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారని.. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని కుమారస్వామి హితవు పలికారు.

'కాంగ్రెస్​ పాదయాత్రకు కరెంట్​ ఎక్కడిది?'
'అక్రమంగా వాడిన కరెంట్​కు సంబంధించి అధికారులను బిల్లు అడిగాను. వారు ఇచ్చిన బిల్లు వివరాలు సరిగ్గా లేవు. మాజీ సీఎంగా నా పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఏటా జరిగే కనకపుర ఉత్సవానికి కరెంట్​ ఎక్కడ నుంచి వస్తుంది? అలాగే కాంగ్రెస్​ పాదయాత్రలకు విద్యుత్​ సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది? ఈ సమయాల్లో ఏమైనా జనరేటర్లు వాడుతున్నారా?' అని కుమారస్వామి ప్రశ్నించారు.

'రాష్ట్రాన్ని, దేశాన్ని ముంచే పనేమీ చేయలేదు'
ఈ విషయంపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం చాలా అన్యాయమని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను గళం విప్పినందుకు తనపై రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. అయితే తానేమీ రాష్ట్రం, దేశం మునిగిపోయేంత పనేమీ చేయలేదని శుక్రవారం నిర్వహించిన విలేకురల సమావేశంలో కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యుత్​ అధికారులు ఈ సంఘటనపై ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ.. ఎఫ్​ఐఆర్​లోని లోపాలను ఎత్తిచూపారు.

అసలేం జరిగింది?
ఈనెల నవంబర్​ 12న దీపావళి సందర్భంగా బెంగళూరు జేపీ నగర్​లోని తన(కుమారస్వామి) ఇంటిని అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి అక్రమంగా తీగలను వేసినట్లు బెస్కాం (బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బెస్కాం ఏఈఈ ప్రశాంత్‌ కుమార్​ కుమారస్వామిపై జయనగర పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆయనపై కేసు నమోదైంది. కుమారస్వామి ఇంటికి విద్యుత్ స్తంభం నుంచి కరెంటు సరఫరా అవుతున్న వీడియోను సైతం అధికార కాంగ్రెస్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది.

అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది- ఆ ట్రయల్స్ సక్సెస్- త్వరలో 3లక్షల మంది!

ఇకపై అమ్మవారికి కూడా 'కాంగ్రెస్​ గృహలక్ష్మి' డబ్బులు​- నెలకు రూ.2వేలు డిపాజిట్- ఆ తర్వాతే రాష్ట్ర మహిళలకు!

ABOUT THE AUTHOR

...view details