తెలంగాణ

telangana

Pawan Kalyan Tour: ధాన్యం కొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు.. పవన్​కు తెలిపిన రైతులు

By

Published : May 10, 2023, 5:27 PM IST

Updated : May 10, 2023, 9:53 PM IST

Pawan Tour In East Godavari: జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడియం ఆవలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతుల కష్టనష్టాలు, దెబ్బతిన్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొలకెత్తిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎదురు డబ్బులు వసూలు చేయడం వంటి విషయాలను పవన్​ కల్యాణ్​కు రైతులు ఏకరువు పెట్టారు.

1
Pawan Tour In East Godavari

రైతులను పరామర్శించిన పవన్​ కల్యాణ్​

Pawan Tour In East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. కడియం ఆవలో నిల్వ చేసిన ధాన్యం రాశుల్ని పరిశీలించారు. రైతుల కష్టనష్టాలు, దెబ్బతిన్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తమ పంట ఎలా తడిసింది, మొలకెత్తిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎదురు డబ్బులు వసూలు చేయడం వంటి విషయాలను పవన్​ కల్యాణ్​కు రైతులు ఏకరువు పెట్టారు.

పవన్​కు సమస్యలు చెప్పుకుని వాపోయిన రైతులు:రోజుల తరబడి కోత కోసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు, ఆ తర్వాత తడిసిన పొలాల్లో మిగిలిన కోతను కోసేందుకు అదనపు ఖర్చులు అయి అప్పుల పాలయ్యామని పవన్​ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. అలాగే ఆవలో డ్రెయిన్ ఏటా పొలాలను ముంచేస్తూ నష్టం కలిగిస్తున్న తీరును కూడా పవన్​కు వివరించారు. పొలం గట్లపై ఉన్న ధాన్యం రాశులను చూసేందుకు పొలాల్లోకి పవన్ దిగడంతో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. పవన్​ వెంట పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాత్రికి రాజమండ్రిలో బస: అంతకుముందు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్​కు తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేశ్​ ఘనస్వాగతం పలికారు. పవన్​ కల్యాణ్​ కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు పవన్ పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లను అధికారులు వేగవంతం చేశారని.. జనసేన నాయకులు విమర్శించారు. పవన్ పర్యటనతో రైతులకు ఇలాగైనా మేలు జరుగుతోందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కడియం ఆవలో పర్యటన అనంతరం.. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాత్రి రాజమండ్రి షెల్టన్ హోటల్​లో పవన్​ బస చేస్తారు.

జనసేన అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీ: ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి రైతులకు సాయం అందించాలని కోరారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రకృతి విపత్తులలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని పవన్​ కల్యాణ్​ హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details