తెలంగాణ

telangana

IRCTC Divya Dakshin Yatra and How to Book Online: ఐఆర్​సీటీసీ సరికొత్త ప్యాకేజీ.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఇప్పుడే బుక్ చేసుకోండిలా.!

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 11:24 AM IST

IRCTC Divya Dakshin Yatra : పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం కేవలం 14 వేల రూపాయలకే 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు ఏంటి..? ఆన్​లైన్​లో టికెట్​ ఎలా బుక్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC
IRCTC

IRCTC Divya Dakshin Yatra Tour Package :భారత్​లో ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు కొద‌వే లేదు. ఎక్కువ మంది సెల‌వులు దొరికితే చాలు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్​సీటీసీ టూరిజం(IRCTC Tourism) ఓ స‌రికొత్త ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. కేవ‌లం రూ.14 వేలకే ఏడు పుణ్య‌క్షేత్రాల‌ను వీక్షించేలా ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 9 రోజుల పాటు సాగే ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Divya Dakshin Yatra Package Full Details :దివ్య దక్షిణ యాత్ర(Divya Dakshin Yatra) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూరింగ్ ప్యాకేజీని మరోసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ఇప్పటికే ఓసారి విజయవంతంగా పూర్త‌యిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు(Bharat Gaurav Tourists Train)లో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ మరోసారి ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.14 వేలకే ఈ ప్యాకేజీని ప్రయాణికులకు ఆఫర్​ చేస్తోంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్‌లోని ప్రముఖ దేవస్థానాలతో పాటు స‌మీపంలోని పర్యాటక ప్రాంతాలను కూడా వీక్షించొచ్చు. అక్టోబర్ 31న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్‌ మొత్తం 8 రాత్రులు 9 రోజులు కొనసాగుతుంది.

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంటలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు కూడా ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

దివ్య దక్షిణ యాత్ర ప్రయాణం కొనసాగనుందిలా..

  • ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్‌లో ప్రారంభమ‌వుతుంది. ఆ రోజంతా ప్రయాణం సాగుతుంది.
  • రెండో రోజు ఉదయం తిరువణ్ణామలైకు చేరుకుని.. అక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని మధురైకు పయనమవుతారు.
  • మూడో రోజు ఉదయం మధురై చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులో రామేశ్వరం చేరుకుని ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌లో భోజనం ఉంటుంది. ఆ రోజు రాత్రి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది.
  • నాలుగో రోజు రామేశ్వరం నుంచి మధురైకు ప్ర‌యాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి రైల్వేస్టేషన్​కు చేరుకొని కన్యాకుమారికి ప్రయాణమవుతారు.
  • ఐదో రోజు కన్యాకుమారి చేరుకుంటారు. అనంతరం అక్కడి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వివేకానంద రాక్‌ మెమోరియల్‌, కుమారి అమ్మన్ టెంపుల్, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
  • ఆరో రోజు మార్నింగ్ కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ చేరుకొని తిరువనంతపురం(కొచ్చువేలి) పయనమవుతారు. అక్కడే టిఫిన్ ముగించుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని.. కోవలం బీచ్‌ అందాలు వీక్షిస్తారు. అనంతరం కొచ్చువేలి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరుచిరాపల్లికి బయల్దేరుతారు.
  • ఏడో రోజు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. మార్నింగ్ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మధ్యాహ్నం భోజనం ముగించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూర్‌ చేరుకొని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు.
  • అనంతరం తంజావూర్‌లో సికింద్రాబాద్‌ రైలు ఎక్కుతారు. ఎమిది, తొమ్మిదో రోజు ప్రయాణం ఉంటుంది. 9వ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి​!

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ధర :

IRCTC Divya Dakshin Yatra Package Cost : ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే టూరిజంను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే భారత్ గౌరవ్ స్కీమ్‌లో భాగంగా 33 శాతం కన్సెషన్ అందిస్తోంది. ఇక ఈ టూర్​లో భాగంగా ఎకానమీ ప్యాకేజీ ధర రూ. 14,100, స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ. 21,500, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ. 27,900గా ఉంది.

ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ బుక్ చేయడం ఎలా?

How to Book IRCTC Divya Dakshin Yatra Online:

  • ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ బుక్ చేయడానికి ముందుగా https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత హోమ్ పేజీలో భార‌త్ గౌర‌వ్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ దివ్య దక్షిణ యాత్ర వేర్వేరు తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • కాబట్టి ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసేముందు వివరాలన్నీ చెక్ చేసి, లాగిన్ అయి బుక్ చేయాలి.

Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్​ టికెట్​ను ఈజీగా ట్రాన్స్​ఫర్ చేసుకోండిలా?

How To Book Entire Coach In Train : ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారా?.. తక్కువ ధరకే మొత్తం కోచ్​నే బుక్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details