తెలంగాణ

telangana

corona vaccination: వచ్చే నెలలో మరో 30 కోట్ల డోసులు

By

Published : Oct 29, 2021, 5:01 AM IST

ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేసే దిశగా (corona vaccines doses) ప్రయత్నాలను ముమ్మరం చేసింది కేంద్రం. వచ్చే నెలలో 30 కోట్ల టీకా డోసులు సేకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

corona vaccination
కరోనా వ్యాక్సినేషన్

ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తి చేయాలని (corona vaccines doses) లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్రం.. ఆ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. వచ్చే నెలలో 30 కోట్ల టీకా డోసులు (corona vaccination) సేకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందులో భారత్‌ బయోటెక్‌ తయారీ -కొవాగ్జిన్‌ టీకా 6కోట్ల డోసులు, సీరం ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకా 22కోట్ల డోసులు, క్యాడిలాకు చెందిన జైడస్‌ టీకా 2కోట్ల డోసులు సేకరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలే వంద కోట్ల టీకా డోసుల మైలురాయిని భారత్ చేరింది. వచ్చేనెల చివరి నాటికి టీకా పంపిణీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో వ్యాక్సిన్‌ పంపిణీలో వెనకబడిన జిల్లాల్లో 'హర్‌ ఘర్‌ దస్తక్‌' పేరుతో మెగా ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్‌ మాండవియా తెలిపారు..

ఇదీ చదవండి:ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details