తెలంగాణ

telangana

దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్​ కేసులు

By

Published : Apr 29, 2022, 9:18 AM IST

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 3,377 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 60 మంది వైరస్​కు బలయ్యారు.

Corona Cases In India
Corona Cases In India

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 3,377 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,496 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 72వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది.

  • యాక్టివ్ కేసులు: 17801
  • మొత్తం మరణాలు: 523753
  • మొత్తం కేసులు: 4,30,72,176
  • రికవరీలు: 4,25,30,622

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 22,80,743 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,65,46,894 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 6,28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,561 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 1,19,832 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 239 మంది మృతిచెందారు.
  • ఇటలీలో 69,204 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 59,760 మంది వైరస్​ సోకింది. మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 57,439 కరోనా కేసులు నమోదయ్యాయి. 122 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 55,692 కరోనా కేసులు బయటపడ్డాయి. 247 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చదవండి:5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాలు.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details