తెలంగాణ

telangana

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

By

Published : Apr 21, 2022, 9:25 AM IST

Corona Cases: దేశంలో కొత్తగా 2,380 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 56 మంది వైరస్​కు బలయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

India corona cases
కరోనా న్యూస్

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే పెరిగింది. మరో 2,380 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 49వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది.

  • యాక్టివ్ కేసులు: 13,433
  • మొత్తం మరణాలు: 5,22,062
  • మొత్తం కేసులు: 4,30,49,974
  • రికవరీలు: 4,25,14,479

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం 15,47,288 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,07,08,111కు చేరింది. మరో 4,49,114 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 9,04,073 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,222 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 187,233 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 361 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 155,711 మంది వైరస్​ సోకింది. మరో 227 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 111,280 కరోనా కేసులు నమోదయ్యాయి. 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 99,848 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 205 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో 51,325 కరోనా కేసులు బయటపడ్డాయి. 38 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చదవండి:60 సెకన్లు.. 150 కొబ్బరికాయలు.. ఒంటి చేత్తో అరుదైన రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details