తెలంగాణ

telangana

మీడియా ఎఫెక్ట్​.. దివ్యాంగ బాలికకు అండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

By

Published : May 7, 2022, 9:23 AM IST

Stalin Support To Girl: ఓ దివ్యాంగ బాలికకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ అండగా నిలిచారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఎంతో శ్రద్ధగా బోర్డు పరీక్షలు రాస్తున్న ఆ విద్యార్థిని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ ప్రకటించారు.

mpact of Media: CM Extends support to differently abled girl
mpact of Media: CM Extends support to differently abled girl

Stalin Support To Girl: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​.. ఆ రాష్ట్రానికి చెందిన ఓ దివ్యాంగురాలికి అండగా నిలిచారు. రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురై ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న వాలీబాల్ క్రీడాకారిణి, విద్యార్థిని సింధుకు ఆర్థిక భరోసా కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ 12వ తరగతి బోర్డు పరీక్షలను ఓర్పుతో రాస్తోంది సింధు.

తండ్రితో సింధు

సివిల్ సర్వీస్​లో జాబ్​ కొట్టాలని.. చెన్నైలోని కొడంబాక్కంలో నివసించే సాధేస్ కుమార్తె సింధు. 10వ తరగతి చదువుతున్న సమయంలో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటున్న సింధు.. ఒక్కసారిగా మూడో అంతస్తు నుంచి జారిపడింది. నడుముకు పెద్ద గాయం తగిలి నడవలేని స్థితికి చేరుకుంది. గత రెండేళ్లుగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పూర్తిగా కోలుకోకపోవడం వల్ల సింధు తల్లిదండ్రులు ఆమెను ఎత్తుకుంటూ పరీక్షా కేంద్రానికి తీసుకొస్తున్నారు. అంతేకాదు సింధుకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉండేది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్మీలో చేరలేకపోయినా.. సివిల్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తండ్రితో సింధు
సింధు

అయితే సింధుపై ఇటీవలే మీడియా వరుస కథనాలు ప్రచురించింది. వాటిని చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించి ట్వీట్​చేశారు. 'ఓ వ్యక్తి మనోబలం కష్ట సమయాల్లోనే బయటపడుతుంది. సింధు తన చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి. మళ్లీ వాలీబాల్ ఆడాలనే సింధు కోరికను నెరవేర్చేందుకు అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది' అని స్టాలిన్​ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి:హెల్పర్​ను చంపి.. శవాన్ని మాయం చేసి.. 7 నెలలు పోలీసులకు చుక్కలు

ABOUT THE AUTHOR

...view details